Home హాట్ న్యూస్ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎస్.పంకజ కార్పొరేటర్ లతో సమీక్ష సమావేశం.
హాట్ న్యూస్

ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎస్.పంకజ కార్పొరేటర్ లతో సమీక్ష సమావేశం.


ఈ రోజు ఎల్.బి. నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్ పంకజ గారు సరూర్ నగర్ సర్కిల్ లెవెల్ కన్వర్జెన్స్ మీటింగ్ కార్పొరేటర్లు, జి.హెచ్.యం.సి అధికారులు మరియు ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

1. డిసిల్టింగ్ వర్క్స్
రానున్న వర్ష కాలం దృష్టిలో పెట్టుకొని నాలల వద్ద డిసిల్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అట్టి పనుల్లో కార్పొరేటర్లుకు సమాచారం ఇచ్చి వారిని కూడా బాగస్వామ్యులు చేయాలని ఆదేశించారు.

2. నాల ఆడిట్
ఎల్.బి. నగర్ జోన్లో ఉన్న నాలల పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి యొక్క పనులను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

కార్పొరేటర్లు అందరూ చాలా చోట వాటర్ సప్లై సరిగా రావడం లేదు మరియు టైమింగ్ కూడా పెంచాలి అని కోరడం జరిగింది. లౌ ప్రెషర్ సమస్యలను కూడా పరిష్కరించాలి అని కోరడం జరిగింది. కొన్ని ఏరియాలో డ్రింకింగ్ వాటర్ మరియు డ్రైనేజీ వాటర్ మిక్స్ అవుతున్నాయి అలా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యూజీడి బ్లికేజీ మరియు రేమోడెల్లింగ్ పనులను వెంటనే చేపట్టాలని కోరారు.

రోడ్లు ఆక్రమించి గడ్డిఅన్నారం ఏరియా లో కమర్షియల్ షాప్స్ మరియు వాటి ముందు చిన్న చిన్న షాప్స్ వెంటనే తొలిగించాలి అని కోరారు.

కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు చెట్లు కోటి రోడ్ల పైన వదిలేయడం జరుగుతుంది. దాని వలన రోడ్డుపై చెత్త పెరుకుపోతుంది. కావున వాటిని వెంట వెంటనే తొలిగించాలి అని కోరారు.

సర్కిల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు వెంటనే తొలిగించాలి అని కోరారు.

కాలనీ పార్కులో మైంటైనెన్సు సరిగా లేదు మైంటైనెన్సు వెంటనే చేయాలని కోరారు.

చెత్త స్వీకరణ కోసం చెత్త రీక్షలు మంజూరు చేయాలని కోరారు.

చెత్త ఓపెన్ పాయింట్స్ రోజు రోజు క్లియర్ చేసి బ్లీచింగ్ పౌడర్ వంటివి వేయాలని కోరారు.

డివిజన్ జరుగుతున్న పనులు మరియు జరగాల్సిన పనులను వేగవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు శ్రీమతి.ఆకుల శ్రీవని, సరూర్ నగర్, శ్రీ.పవన్ కుమార్, కొత్తపేట, శ్రీ.రంగ వెంకట్ నరసింహ రావు, చైతన్యపురి, శ్రీ.బద్దం ప్రేమ్ మహేశ్వర రెడ్డి, గడ్డిఅన్నారం, శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ. బి. ప్రసాద్ రావు, సీపీ, శ్రీ. రాజ్ కుమార్, డిడి (యుబిడి), శ్రీ. విద్య సాగర్, ఈఈ (ఎలక్ట్రికల్), డిప్యూటీ కమిషనర్ శ్రీ. హెచ్. కృష్ణయ్య, ఇంజనీరింగ్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు, ట్రాఫిక్ మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page