బహిష్కరణకు గురి అయిన వడ్డెర కుటుంబాల తహశీల్దార్ కార్యాలయ ముట్టడి…….
నిర్మల్ జిల్లా, తెలంగాణ వార్త: గ్రామ బహిష్కరణకుగురి అయిన వడ్డెర కుటుంబాలు 10రోజులు గడుస్తున్న ఇంకా న్యాయం జరగకపోవడంతో ఈ రోజు న్యూ సాగ్వి గ్రామం నుండి మమాడా తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడ్డం జరిగింది.
గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అనేక అక్రమాలకు పాలుపడుడుతున్న గ్రామాభివృద్ధి కమిటీ పాత కాలపు రాచరిక వ్యవస్థ పునరావృత మయ్యే రీతిలో 400 కుటుంబాల పై అజమాయిషీ చెలాయిస్తూ , రోడ్డు దాటిన వారికి 5000 రూపాయల జరిమానా విధిస్తూ,చూసిన వారికి 1000 రూపాయల నజరానా ప్రకటిస్తూ, ఎక్కడ లేని నిబందనలను విధించి , వేదించి, వల్ల పశువుల కదలికలను వల్ల కదలికలను అక్రమంగా నియంత్రిస్తూ ఉన్న VDC……
పది రోజుల నుండి అధికారుల పని తీరు ఎంత నిర్లక్ష్యంగా , ప్రజలు అంటే గౌరవం లేకుండా, చట్టాలు అంటే గౌరవం లేకుండా పని చేస్తున్నారో దీన్నిబట్టి స్పష్టమౌతుంది…..
సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లు, VDC చేతిలో కీలు బొమ్మలుగా మారి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు …
ఇది చట్ట వ్యతిరేకమని అధికారుల దృష్టికి తీసుకు వచ్చాం…..ప్రజలు తిరుగుబాటు చేస్తున్న కూడా అధికారులు స్పందించడం లేదు…..
జిల్లా కలెక్టర్ వెంటనే గ్రామాభివృద్ధి కమిటీ లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలి ……చట్ట బద్దత లేని కమిటీ నీ ఆ కమిటీ నాయకులకు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా , వార్డ్ మెంబర్ , సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ ల పరిది లోనే పరిపాలన కొనసాగాలి అని అన్నారు.
గ్రామస్థులు వారి హక్కుల కోసం ఎంతటి పొరటల కైన సిద్ధమవుతారు అని, జిల్లా కలెక్టర్ గారు దృష్టి సారించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు….. సామల రవీందర్ అన్నారు.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు సంపంగి ప్రభాకర్ ,తమ్మిషెట్టీ శ్రీనివాస్ సాయూలు , మాక్కల గంగదర్ రాజేందర్, పోషన్న పాల్గొన్నారు ….. దీనిపై సి ఐ ని వివరణ కోరగా నా పరిధిలో లేదు డీఎస్పీ పరిధిలో ఉంది అని అని వేశారు.
Leave a comment