Home హాట్ న్యూస్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే నా భాగ్యం:: puc చైర్మన్ టిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ ఆశన్న గారి జీవన్ రెడ్డి.
హాట్ న్యూస్

ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే నా భాగ్యం:: puc చైర్మన్ టిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ ఆశన్న గారి జీవన్ రెడ్డి.


ఆర్మూర్ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

-అనారోగ్య బాధితులకు ఉచిత వైద్యం

-ఆరోగ్య సమస్యలుంటే నా వద్దకు రండి

-పెద్దాసుపత్రుల్లో వైద్యం చేయిస్తా

-ఆరోగ్యశ్రీ, సీఎం ఆర్ ఎఫ్, ఎల్ ఓ సీలు ప్రజలకు శ్రీరామరక్ష

-ఆర్మూర్ లో ఇప్పటికే50వేల మందికి పైగా ఉచిత వైద్య సాయం

-ప్రజా ప్రతినిధులు ఉచిత వైద్యం పై అవగాహన కల్పించాలి

-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

  • పత్తేపూర్లో ఎల్ వో సీ చెక్కుల పంపిణీ

ఆర్మూర్, ఏప్రిల్18:- తెలంగాణ వార్త
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్మూర్ మండలం పత్తేపూర్ గామానికి చెందిన అనుప్రియ అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల 59వేల రూపాయల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కును సోమవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 50వేల మందికి ప్రభుత్వ పరంగా ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అండగా ఉన్నామన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలకు మార్చి అత్యాధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానంతో తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. ఆర్మూర్ ఆసుపత్రిలో ఇప్పటికే దాదాపు 25వేల ఉచిత ప్రసవాలు జరిగి వారికి కేసీఆర్ కిట్లు అందించామని జీవన్ రెడ్డి వివరించారు. మరో 25వేల మందికి ఆరోగ్యశ్రీ, ఎల్ ఓసీ, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి వాటి ద్వారా వేలాదిమందికి వైద్య సహాయం అందుతోందన్నారు. ఇదిలావుండగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తన వద్దకు వస్తే పెద్దాసుపత్రుల్లో చేర్పించి ఆరోగ్యశ్రీ, ఎల్ వో సీ , సీఎం అర్ ఎఫ్ ల ద్వారా వైద్యం చేయిస్తామని, ఈ స్కీములు వర్తించని వారికి పెద్దాసుపత్రుల్లో డిస్కౌంట్ ఇప్పించే బాధ్యతను కూడా తానే తీసుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామ రక్ష అయిన ఆరోగ్యశ్రీ, ఎల్ వో సీ, సీఎం ఆర్ ఎఫ్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో కొంతమంది సొంత ఖర్చులతో పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం పొందినవారున్నారు. అయిదు లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు వారు సంబంధిత బిల్లులను ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేస్తే సీఎంతో మాట్లాడి ఆ బిల్లులను మంజూరు చేయిస్తా. అలాగే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న వారు కూడా తమ వివరాలను నా ఫోన్ నంబర్-99496-99999కు కాల్ చేసి చెప్పండి. నేను అందుబాటులో లేకుంటే నా పీఏ లు సుమంత్ నంబర్-9502317803, రాజేష్ నంబర్-98666 01096, శ్రీకాంత్ నంబర్-9010771277 లకు ఫోన్ చేసి వివరాలను తెలిపితే వెంటనే వారిని నిమ్స్ తో పాటు ప్రెయివేట్ కార్పొరేట్ దవాఖానల్లో చేర్పించి ప్రభుత్వ ఖర్చులతో వైద్య చికిత్సలు చేయిస్తాం” అని ఆయన పేర్కొన్నారు. టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారు కూడా తమ వివరాలను నిజామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఇవ్వాలని ఆయన సూచించారు.అలాగే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు ప్రజల ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రభుత్వ వైద్య విధానాలు, ప్రభుత్వం ద్వారా లభించే ఉచిత వైద్య సహాయ మార్గాల గురించి అవగాహన కలిపించాలని జీవన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ ఛైర్మన్ పండిత్ వినీతా పవన్, వైస్ ఛైర్మన్ మున్ను భాయ్, పీఏసీఎస్ ఛైర్మన్లు, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపిటీసిలు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page