నందిపేట్ (తెలంగాణ వార్త)ఆర్మూర్ ఎమ్మెల్యే PUC చైర్మన్ నిజాంబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ అన్న గారి ఆదేశాల మేరకు నందిపేట మండలంలోని ఆంధ్ర నగర్ కౌల్పూర్ గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి కమిటీలను నియమించి, మై నేతాజీ ఆప్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలోని సామాన్య కార్యకర్త కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్ ను రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా ప్రతి సామాన్య కార్యకర్త కష్టనష్టాలను ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజల అవసరాలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడానికి కార్యకర్తలకు సులభంగా ఉంటుందని వివరించడం జరిగింది. ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త టిఆర్ఎస్ శ్రేణులు అందరూ ఐక్యమత్యంతో పని చేస్తూ నందిపేట మండలం లో టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూఆర్మూర్ నియోజకవర్గ చరిత్రలో దమ్మున్న లీడర్ జీవన్ రెడ్డి గారిని బలపరచాలని కోరడం జరిగింది.ప్రతి నాయకులు కార్యకర్త ప్రజాప్రతినిధులందరూ ఎమ్మెల్యే గారి వెంట నడుస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ , నందిపేట మండల జడ్పిటిసి ఎర్ర ముత్యం, ఆంధ్ర నగర్ గ్రామ సర్పంచ్ రామారావు, ఉప సర్పంచ్ కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షులు నాయుడు శ్రీధర్, కౌలు పూర్ గ్రామ సర్పంచ్ గబ్బర్‌సింగ్, కల్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగ రావు టిఆర్ఎస్ శ్రేణులు అందరూ పాల్గొనడం జరిగింది.
Leave a comment