చేంచల్ గూడ, హైదరాబాద్ (తెలంగాణ వార్త) హైదరాబాద్ చంచల్గూడా జైలుకు ఎన్. ఎస్. యు. ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జెడ్ కేటగిరీ తో మరియు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 12 గంటలకు చంచల్గూడ జైలు కు వచ్చారు. జైల్లో ఎన్ ఎస్ యు ఐ నాయకులు 14 మంది ఉండగా, ఒక్కరి ని కలవడానికి కోట్లు కోర్టు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. జైలులో వెంకట్ తో పాటు విద్యార్థి నాయకులు నిరాహార దీక్ష చేస్తున్నారు వారిని పరామర్శించి రాహుల్ గాంధీ నిరాహార దీక్ష విరమింప చేస్తారని అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎన్ ఎస్ యు ఐ నాయకులపై గాడిద దొంగతనం కేసు , మహిళలను వేధిస్తున్నారని ఇంకో కేసు పోలీసులు పెట్టారు అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పరామర్శించడానికి రాహుల్ గాంధీ జైలు లోపలికి రేవంత్ రెడ్డి తవెళ్లడం జరిగింది.
Leave a comment