తెలంగాణ వార్త: ఆర్మూర్ పెర్కిట్
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పెర్కిట్ గ్రామంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని కులాల సమక్షంలో ప్రతీ ఇంటినుండి మహిళలు బోనాలతో మహాలక్మి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు ప్రజలు కరోనా మహమ్మారిన పడి ఆరోగ్యంగా మరియు ఆర్థికంగా చతికిలపడి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారని అన్నారు.అయితే మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించే దిశలో అన్ని సంఘాల సహకారంతో పెద్ద ఎత్తున బోనాల పండుగను నిర్వహించామన్నారు.ఈ బోనాల పండుగకు ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు బోనాలతో అమ్మవారికి సమర్పించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దొంద భూమన్న,ఉపాధ్యక్షులు మునిపెల్లి పెద్ద సాయన్న,కోశాధికారి నచ్చు సత్యం,నచ్చు నాగరాజు,సభ్యులు రాస ప్రతాప్,y.గంగారాం,ముత్తెన్న,నీరటి రాజన్న,అశోక్ గటడి,మూడ గంగాధర్,సంతోష్,సల్లగరిగే నర్సయ్య,శివకుమార్ గౌడ్,సాయిలు లతో పాటు మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు తీగెల నర్సారెడ్డి,వెంచిర్యాల వసంత్ రెడ్డి,నచ్చు గంగారెడ్డి(కోటార్మూర్) ఆర్మూర్ నియోజకవర్గ 4వ వార్డు కౌన్సిలర్ పాలేపు లత-రాజు మరియు పెర్కిట్ సహాకార సంఘ అధ్యక్షులు పెంట బోజరెడ్డి పాల్గొనడం జరిగింది.
Leave a comment