*వైఎస్ఆర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పార్టీ జండా ఆవిష్కరించిన బుస్సాపూర్ శంకర్*
శుక్రవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు వైఎస్ఆర్ గారి జయంతి సందర్బంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారి నివాసంలో రాజన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు మరియు రాజన్న విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది
అనంతరం పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం జ్ఞాపికగా బుస్సాపూర్ శంకర్ గారి ఇంటి వద్ద పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారూ.
ఆ తరువాత పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పిప్పేర లావణ్య గారి ఆధ్వర్యంలో పార్టీ జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారూ ముఖ్య అతిధిగా హాజరై పార్టీ జండా ఆవిష్కరించారు
ఆ తరువాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పార్టీ నాయకులందరూ రాజన్న సంక్షేమ పథకాల ప్లకార్డుల ప్రదర్శన చేశారు ఆ తరువాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పార్టీ నాయకులందరూ పండ్లు పంపిణీ చేశారు.
అదే విధంగా నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ ప్రాంతంలో మైనారిటీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన YSR తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బుస్సాపూర్ శంకర్ గారు హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారూ , పార్టీ మహిళ విభాగం జిల్లా ఉపద్యక్షురాలు అగిశాల సమత గారి ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు హాజరయ్యారు
ఈ సందర్బంగా బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ
ప్రతి ఇంట్లో రాజన్నపై అభిమానం ఉందని , రాజన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇళ్లు లబ్ధి పొందిందన్నారు.
రాజశేఖర రెడ్డి గారు మంచి మనసున్న మనిషి కాబట్టే మంచి నాయకూడయ్యాడని , మంచి నాయకుడు కాబట్టే మహా నాయకూడయ్యాడని అన్నారు.
ఈ రోజుటి వరకు ఆయన ఇచ్చిన ఇళ్ళు , ఆరోగ్య శ్రీ , ఫీజు రియంబర్స్మెంట్ ,రైతన్నలకు ఉచిత విద్యుత్ ద్వారా తమ జీవితాలు మారాయని ప్రజలు పాదయాత్రలో షర్మిలమ్మకు చెబుతూ షర్మిలమ్మ కు తోడుగా ప్రజలున్నరని ధైర్యం ఇస్తున్నారన్నారూ.
రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకుని రావడానికే రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారని , తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా కార్యదర్శి పిప్పేరా లావణ్య , జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు గైనికడి విజయలక్ష్మి , జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు అబేద్ , జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు జకరియా , జిల్లా మహిళ ఉపద్యక్షురాలు సమత , కార్యదర్శి స్వప్న , కార్యవర్గ సభ్యురాలు రాజా సులోచన , జిల్లా మైనారిటీ ఉపద్యక్షులు ఖలేద్ , నగర మైనార్టీ విభాగం అధ్యక్షులు అజిమ్ , నగర యువజన విభాగం అధ్యక్షులు ప్రితం , నగర మైనారిటీ ఉపద్యక్షులు అన్వర్ , ప్రధాన కార్యదర్శి ఆర్షద్ , జాయింట్ సెక్రటరీ అమాన్ ,జాయింట్ సెక్రటరీ సాధిక్ , గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
Leave a comment