నందిపేట్, తెలంగాణ వార్త:: నందిపేట మండలంలోని బజార్ కొత్తూరు గ్రామంలో స్థానిక గుట్ట మీద అటవీశాఖ అధికారులు చెక్ డ్యాం నిర్మించారు. ఇట్టి చెక్ డ్యామ్ నిర్మాణం నాసిరకంగా చేపట్టారు. ఈ చెక్ డ్యాం పోయిన ఎండాకాలంలో నిర్మించారు. కానీ దానికి అలుగు ఏర్పాటు చేయలేదు మొన్నటి నుండి వర్షాలు కురుస్తున్న కారణంగా ఒక్కసారిగా నీరు రావడంతో చెక్ డాం కూలిపోయి నీళ్లు ఒక్కసారిగా స్థానిక చెరువు లోకి వచ్చాయి పెద్ద పెద్ద బండరాళ్లు ఇసుక పంట పొలాల్లో కొట్టుకొని వచ్చాయి నీళ్లు ఒక్కసారిగా రావడంతో చెరువులో అలుగు తెగిపోయింది, దీంతో చెరువులో ఉన్న దాదాపు రెండు లక్షల రూపాయల చేపలు బయటకు వెళ్లిపోయాయి పంట పొలాలకు గండ్లు పడ్డాయి. ఈ చెక్ డ్యామ్ నిర్మించిన సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక గంగపుత్రులు రైతులు కోరుతున్నారు.
Leave a comment