రంగారెడ్డి జిల్లా, తెలంగాణ వార్త: తేదీ 24 9 2022న రంగారెడ్డి జిల్లా లో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మోతి గారి ఆధ్వర్యంలో కొంగర కొలాన్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో బొడ్డెమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది మీటింగ్ కు జిల్లా సంక్షేమ అధికారి గారు జెడ్పి స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి విశాల గారు మరియు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుసింధర్ గారు కార్పొరేటర్ మహేందర్ గారు స్కూల్ హెడ్మాస్టర్ వెంకటరమణ శాస్త్రి గారు మరియు స్కూల్ సిబ్బంది. సిడిపిఓలు ఇబ్రహీంపట్నం సిడిపిఓ సుజని గారు మరియు శ్రీమతి శాంతి శ్రీ గారు లీగల్ కౌన్సిలర్ విజయభాస్కర్ గారు డి సి పి యు సిబ్బంది డి డి ఆర్ సి సిబ్బంది సూపర్వైజర్లు సఖి కేంద్రం మహిళా శక్తి కేంద్రం అంగన్వాడి టీచర్లు ఆయాలు కార్పొరేటర్ మహేందర్ గారు శ్రీనివాస మరియు వినాయక స్కూల్ పిల్లలు జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలు కిశోర బాలబాలికలు పాల్గొన్నారు.
మీటింగులో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చర్చించిన అంశములు కిశోర బాలికల బొడ్డెమ్మ సంబరాలు పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మను ఎలా తయారు చేయాలి బొడ్డెమ్మ పండుగ విశిష్టత గురించి చెప్పడం జరిగినది కిశోర బాలికలు
వారు ఎదిగే వయస్సు కాబట్టి వారికి న్యూట్రిషన్ గురించి మరియు వారి వ్యక్తిగత పరి శుభ్రత గురించి బాల్యవివాహాల గురించి వారి వ్యక్తిగత సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? వారికి చదువుకుంటే ఇలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చు అని వివరించారు జెడ్పి స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి విశాల గారు న్యూట్రిషన్ ఫుడ్ గురించి మరియు సెల్ఫోన్ ఎలా వాడాలి? ఫోన్ వలన లాభమేంటి నష్టం ఏంటి అని వివరించారు సారీ ప్లీజ్ థాంక్యు మూడు విషయాలు రోజు వారి దినచర్యలో తప్పకుండా ఉపయోగించాలని స్కూల్ కి సెలవులు కాబట్టి బతుకమ్మ పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఏజీ గర్ల్స్ కి ప్రథమ బహుమతులు ఇవ్వడం అందజేయడం జరిగింది
హెడ్మాస్టర్ : బొడ్డెమ్మ సంబరాలు జిల్లా పరిషత్ హై స్కూల్ పరిసరాల్లో నిర్వహించినందుకు చాలా సంతోషం గా ఉందని తెలియజేశారు బొడ్డెమ్మ సంబరాలలో కిశోర బాలికలు ఎక్కువ సంఖ్యలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఇట్టి బొడ్డెమ్మ సంబరాలు నిర్వహించి ముఖ్య అతిథులు పాల్గొని విజయవంతం చేశారు
Leave a comment