ప్రాణగండం నుంచి బయట పడిన ఉపాధ్యాయులు.
నిజామాబాద్ / నందిపేట్. తెలంగాణ వార్త::
నందిపేట మండలంలోని ఆంధ్రనగర్ గ్రామ సమీపం లో రోడ్డు పై ఉన్న వడ్ల కుప్ప ఎక్కి కారు పల్టీలు కొట్టి న ఘటన గురువారం జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఇలా ఉన్నాయి ఐలాపూర్ గ్రామ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులుTS16 EV 7026 నంబర్ గల కారులో గురువారం ఉదయం పాటశాల కు వెళుతుండగా అంద్రనగర్ గ్రామ నూతన ఆలయం, విలేజ్ పార్క్ వద్ద ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయి వరికుప్ప పై ఎక్కి కారు పల్టీలు కొడుతూ బోల్తా పడింది అయినప్పటికీ అదృష్టవశాత్తు కారులో ఉన్న ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.
కొద్దీ దూరంలో ట్రాన్స్ఫార్మర్ ఉంది కాని అట్టి కారు ట్రాన్స్ఫార్మర్ వద్దకే వచ్చి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వరి పంట చేతికి వచ్చిందంటే చాలు రైతులు వరి ధాన్యాన్ని కోసి రోడ్లపై ఆరబోస్తూ ఆరబోసిన వారి ధాన్యాంపై వాహనాలు వెళ్లకుండా పెద్ద పెద్ద బండ రాళ్లు పెట్టడంతో ద్విచక్ర వాహనదారులు వరికుప్పలకు, అడ్డుగా పెట్టిన బండరాళ్లను డీకొని ప్రమాదాల బారిన పడుతు ప్రాణాలు పోతున్న అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై వరి ధాన్యాలను ఆరబోసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు, వరికుప్పలను ఢీకొని ఎంతోమంది యువకులు ప్రాణాలు పోతున్న సంఘటనలు జరిగి తీవ్ర గాయాల పాలై న వారు ఎందరో ఉన్నారని ప్రమాదాలకు కారణమయ్యే అంశాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
.
Leave a comment