Home జనరల్ <em>తెలంగాణకు ప్రధాని రాకతో…. ఢిల్లీకి పరారైన కెసిఆర్…..</em>
జనరల్

తెలంగాణకు ప్రధాని రాకతో…. ఢిల్లీకి పరారైన కెసిఆర్…..

హైదరాబాద్ శేర్లింగంపల్లి,తెలంగాణ వార్త ::

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం

తెలంగాణకు విచ్చేయుచున్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి భారీ ర్యాలీతో బేగంపేట విమానాశ్రయంకు బయలుదేరిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

ఈరోజు రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి విచ్చేయుచున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి , బేగంపేట విమానాశ్రయానికి విచ్చేయుచున్న నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి భారీ ఎత్తున మహిళలు, నాయకులు, కార్యకర్తలతో బయలుదేరిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు, సందర్భంగా రవికుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ 1999 ముత పడిన ఎరువుల ఫ్యాక్టరీనీ ఆత్మ నిర్భర్ లో భాగంగా 2015 లో పునరుద్దరణ పనులను ప్రారంభించి 2021 ఫిబ్రవరి 28 లో పూర్తిచేసి దాదాపు 23 సంవత్సరాల తరువాత 6120 కోట్ల రూపాయల ఖర్చుతో పునరుద్ధరించి ..ఈరోజు దేశానికి అంకితం ఇవ్వడానికి విచ్చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి ఈరోజు మనం అందరం కలిసి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎరువుల ఫ్యాక్టరీ వల్ల మన తెలంగాణ ప్రజలకు రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది, దాదాపు 5000 ఉద్యోగాలు లభిస్తాయి. ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులలో సగం మన తెలంగాణకే దక్కుతుండడం చాలా మంచి విషయం, 3700 రూపాయలు గల యూరియా బస్తా 94% సబ్సిడీతో 200 కే లభిస్తుంది. అలాగే 1000 కోట్లతో భద్రాచలం రోడ్డు సత్తుపల్లి రైలు మార్గం జాతికి అంకితం చేయటం, 2200 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయటం గొప్ప పరిణామం అని అన్నారు, మోడీ గారు తెలంగాణకు ఇంత మంచి పనులు చేపడుతుంటే స్వాగతం పలకాల్సిన కెసిఆర్ ఢిల్లీకి వెళ్ళటం సిగ్గుచేటు అని అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టడ్ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జనాభా కులగనన పూర్తిచేసిన కాంగ్రెస్..

    తెలంగాణ వార్త: సెక్రటేరియట్: మోహన్ సాయి సీనియర్ జర్నలిస్ట్::    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్...

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

You cannot copy content of this page