Home జనరల్ మంత్రి ఎర్రబెల్లితో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ గ్రామాల అభివృద్ధికి నిధులివ్వాలని వినతి…..
జనరల్

మంత్రి ఎర్రబెల్లితో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ గ్రామాల అభివృద్ధికి నిధులివ్వాలని వినతి…..

-మంత్రి సానుకూల స్పందన

హైదరాబాద్, నవంబర్ 23 ::తెలంగాణ వార్త
ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి
హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఉన్న సమస్యలను జీవన్ రెడ్డి మంత్రి దయాకర్ రావు దృష్టికి తీసుకువచ్చారు. ఏ ఏ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, వాటి పరిష్కారానికి ఎన్ని నిధులు అవసరమవుతాయో పేర్కొంటూ జీవన్ రెడ్డి మంత్రికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి ఆర్మూర్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మంత్రి దయాకర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో జీవన్ రెడ్డి సమావేశం

-రోడ్ల పరిస్థితిపై సమీక్ష

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని రోడ్ల పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పలు గ్రామాలలో రోడ్లు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏయే గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందో తెలియజేస్తూ ఆయన వినతిపత్రం సమర్పించారు. వీలైనంత త్వరగా అన్నిగ్రామాలలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా మంత్రి ప్రశాంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. జీవన్ రెడ్డి సారధ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసిన వారిలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

అడ్వర్టైజ్మెంట్

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page