ఆర్మూర్ (తెలంగాణ వార్త)
ఈరోజు జిల్లా పరిషత్ రామ్ మందిర్ పాఠశాల ఆర్మూర్ లో షీ టీం అవగాహనా సదస్సును నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్ షీ టీం ఇంచార్జి సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అమ్మాయిల, మహిళల పట్ల అసభ్యంగా పప్రవర్తించే ఆకాథాయిలా గురించి షీ టీం కు ఫిర్యాదు చేస్తే తక్షణమే రక్షణ కల్పిస్తామని, ఆకాతాయిలను కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు మత్తు పదార్తలకు బానిసలు కావద్దని మరియు వీడియో గేమ్స్ ద్వారా సైబర్ నేరస్తుల బారిన పడకుండా ఆర్థిక నష్టాలు కలిగించుకోవద్దని, వాహనం నడిపే లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, ఒకవేళ ఎలా నడిపిబపట్టుబడితే వారి తల్లి దండ్రుల పై చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ షీ టీం సూచనలు సలహాలు విద్యార్థులు అందరు పాటించాలని QR కోడ్ మరియు షీ టీం వాట్స్ అప్ 9490618029 మరియు డయల్ 100 ద్వారా విద్యార్థులు ఫిర్యాదు చేయాలనీ, విషయాలు గొప్యంగా ఉంటాయాని తెలిపారు. ఈ కార్యక్రమం లో మోహన్ దాస్, శ్రీనివాస్, పురుషోత్తమ చారి షీ టీం మహిళా పోలీస్ సుమతి, పాఠశాల ఉపాధ్యాయులు పద్మ, సుజాత శోభా చంద్రకాంత్ రమేష్ అరవింద్ షికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment