ఆర్మూర్( తెలంగాణ వార్త) ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో ఏటీఎం లోని డబ్బును చోరీ చేయడానికి దొంగలు ప్రయత్నం చేయగా విఫలం అయ్యారు ఆర్మూర్ సీఐ సైదేశ్వర చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు ఏ వన్ ఏటీఎం నీ పగలగొట్టి డబ్బులు కాజేయడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది .ఏటీఎం ను పగలగొట్ట డానికి కి గడ్డపార రాడ్లు అక్కడే పడేసి దుండగులు దుండగులు పరారయ్యారని సిఐ తెలిపారు. దొంగలు ఏటీఎం ని పగలగొట్టు డానికి వాడిన గడ్డపార రాడ్లు అక్కడే వదిలేసి వెళ్లినట్లు తెలిపారు డబ్బులు తీయడానికి కి దొంగలు ప్రయత్నించారు కానీ దాంట్లో నుంచి డబ్బులు ఏమీ పోలేదని సిఐ అన్నారు .ఇదిలా ఉండగా గోవింద్ పేట్ గ్రామంలో ఈ మధ్య కాలంలోనే ఇలాంటి సంఘటనలు జరగకుండా గ్రామం మొత్తం సీసీ కెమెరాలు అమర్చారు అయినప్పటికీ కీ ఇలాంటి సంఘటన జరగడం శోచనీయం, గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు పెట్రోలింగ్ కు రావడం లేదని అందు అందుకొరకే చోరీ జరిగిందేమోనని అనుమాన పడుతున్నారు.
Leave a comment