నందిపేట్( తెలంగాణ వార్త )ఈరోజు నందిపేట మండల కేంద్రంలో నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత ఎనిమిది విడతలుగా రైతులకు పెట్టుబడి సాయం రైతు బంధు రూపంలో ఇస్తూ రైతు బాంధవుడిగా మారిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారి చిత్రపటానికి ఆర్మూర్ ఎమ్మెల్యే PUC చైర్మన్ జీవన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు లబ్ధి చేసి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల రుణం తీర్చుకునేందుకు రైతు బంధు రైతు బీమా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు నీటి తీరువా పన్ను రద్దు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక కోటి ఎకరాలకు నీళ్లు ధరణి పోర్టల్ ద్వారా సునాయాస మైన పద్ధతిలో భూమి పట్టా మార్పిడి రైతుకు రక్షణ కార్యక్రమాలు చేపడుతూ యావత్ భారతదేశంలో రైతు పక్షపాతి ప్రభుత్వం గా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ భగవంతుడు రూపంలో వచ్చి రైతుల పాలిట దైవం గా మారాడు. ప్రజలంతా ఈయన జీవితాంతం మా ముఖ్యమంత్రిగా ఉండాలనే పరిస్థితి కల్పించారు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం మన ప్రజలందరూ అదృష్టం అని నందిపేట్ మండల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ ఎం బి రాజేశ్వర్ ,ఎంపీపీ వాకిటి సంతోష్ రెడ్డి ,,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాముడు పోశెట్టి సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్ సీనియర్ నాయకులు vulli శ్రీనివాస్ గౌడ్ ,చెక్ ముత్యం , సుధాకర్ గౌడ్ manpur భూమేశ్వర్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Leave a comment