ఆర్మూర్ ,తెలంగాణ వార్త:
పది వామపక్షాల పిలుపు మేరకు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అధిక ధరలను నియంత్రించి ప్రజల పై పన్ను భారాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణం లో గల కుమార్ నారయణ భవన్ నుండి పాత బస్టాండ్ మీదు ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజాపంథా పార్టీ నేత దేవారాం మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్ను భారాలు వేసి సామన్యుల నడ్డి విరుస్తున్నాయని అన్నారు, కేంద్రం పెట్రోల్ డీజిల్ పై సెస్సు ను రద్దు చేయాలని ఎక్సైజ్ సుంకాల ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్ చేశారు, వీటి పెంపు వల్ల నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి సామన్యుల కొనుగోలు శక్తి పై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు, నిర్మాణ రంగంలో స్టీల్, సిమెంటు,ఇతర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు, వంట గ్యాస్ ధరలు కూడా రోజు రోజుకు పెరిగుతుండడంతో మళ్లి కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు, మరోవైపు నిరుద్యోగ యువత ఉద్యోగాల కై నిరుద్యోగ భృతి కై ఎదురు చూస్తున్నారని అన్నారు, ఈ ధరల పె పు ను నిరసిస్తూ 30 న జిల్లా కేంద్రం లో ధర్నా లు,31 న హైదరాబాద్ లో ఇందిరా పార్కు వద్ద జరిగే ఆందోళన లకు ప్రజలు పాల్గొని అధిక ధరలు, పన్నుల భారాలు తగ్గించేవరకు పోరాటాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో CPIML ప్రజాపంథా పార్టీ ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు సుమన్,ఏపీ గంగారం, రాజన్న, శేఖర్,PYL జిల్లా అధ్యక్షులు కిషన్, POW నాయకులు పద్మ,లక్ష్మీ,సునీత, నాయకులు అరవింద్, నజీర్,మనోజ్,PDSU అధ్యక్షులు నరేందర్ , అనిల్,నిఖిల్ , వినోద్ PYL నాయకులు గుమ్ముల
రవి,కిషోర్, తూర్పటి శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు
Leave a comment