Home జనరల్ అఫిలియేటెడ్‌ కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ సంబంధించి1600 విద్యార్థులు ఫెయిల్..
జనరల్

అఫిలియేటెడ్‌ కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ సంబంధించి1600 విద్యార్థులు ఫెయిల్..

(తెలంగాణ వార్త) రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల పనితీరు అంతంతమాత్రంగా ఉంది. భారీ భవంతులు, హంగులు తప్పితే విద్యార్థులకు తగిన విద్య దొరకడం లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) ఇటీవల విడుదల చేసిన బీటెక్‌ ఫస్టియిర్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలే ఇందుకు నిదర్శనం. అనుబంధ, అఫిలియేటెడ్‌ కళాశాలలకు సంబంధించి శనివారం వెలువడిన ఫలితాల్లో.. దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మొత్తం 25,198 మంది పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా కేవలం 9,198 మంది విద్యార్థులే అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యారు. 16వేల మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పేపర్లలో ఫెయిలై పరీక్షలు తప్పారు. మొత్తంగా ఉత్తీర్ణత శాతం కేవలం 37.40 మాత్రమే. ఈ ఫలితాలను చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల్లో అర్హత కలిగిన, సరిపడా సంఖ్యలో అధ్యాపకులు లేకపోవడమే ఇలాంటి ఫలితాలు రావడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. 50 శాతం కంటే ఎక్కువ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉన్నట్టు సమాచారం. నిజానికి, అఫిలియేషన్‌ రెన్యువల్‌ కోసం జేఎన్‌టీయూ అధికారులు ప్రైవేటు కాలేజీల్లో ప్రతీ యేటా తనిఖీలు చేస్తుంటారు. అధ్యాపకులు, వసతులు అన్నింటిని పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తారు. అయితే, జేఎన్‌టీయూ అధికారుల బృందం తనిఖీలకు వచ్చినప్పుడు.. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు డమ్మీ ఫ్యాకల్టీని చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాక, నిబంధనల మేరకు వేతనాలు చెల్లించలేక చాలా యాజమాన్యాలు అధ్యాపకుల సంఖ్యను గుట్టుగా తగ్గించేస్తున్నాయి. దీంతో అధ్యాపకులు లేక విద్యా బోధన అస్తవ్యస్తంగా మారి అది విద్యార్థులను ప్రభావితం చేస్తోంది. ప్రైవేటు కాలేజీల్లో జేఎన్‌టీయూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో జేఎన్‌టీయూ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. కాగా, జేఎన్‌టీయూ అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం ఇటీవల తీసుకొచ్చిన ఆర్‌-22 నిబంధన వల్ల 600 మంది ఫస్టియిర్‌ విద్యార్థులు మొదటి సెమిస్టర్‌ పరీక్షలకు దూరమయ్యారు. ఇంటర్నల్స్‌లో 40 శాతం మార్కులు సాధించని విద్యార్థులను ఎక్స్‌టర్నల్స్‌కు అనుమతించం అనేది ఆర్‌-22 నిబంధన. దీని వల్ల 600 మంది విద్యార్థులు వచ్చే ఏడాది తమ జూనియర్స్‌తో కలిసి పరీక్షలు రాసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌లో కలిపి సగటున 40శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందేలా పాత విధానాన్నే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page