Home జనరల్ ఆలూరు బైపాస్ రోడ్డు యాల్ల రాములు కల… ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
జనరల్

ఆలూరు బైపాస్ రోడ్డు యాల్ల రాములు కల… ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-దానిని సాకారం చేసి రుణం తీర్చుకున్న

-ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో ఆలూరు రోడ్డు వేయించా

-దివంగత రాములు బతికినంత కాలం ప్రజల కోసమే తపించారు

-ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుండే వారు

-ఆర్మూర్ అభివృద్ధిలో రాములు పాత్ర ఎనలేనిది

-రాములు స్పూర్తితో ముందుకు సాగుతా

-పీయూసీ చైర్మన్ , ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-దివంగత నేత యాల్లరాములు విగ్రహావిష్కరణ

-రాములు బంధుమిత్రులను ఘనంగా సన్మానించిన జీవన్ రెడ్డి

-ఆలూరు రోడ్డుకు యాల్ల రాములు బైపాస్ రోడ్డుగా నామకరణం

ఆర్మూర్, ఫిబ్రవరి24:- తెలంగాణ వార్త:

ఆలూరు బైపాస్ రోడ్డు నిర్మించి ఆటో కూడా తిరగలేని ఇరుకు రోడ్ల కష్టాల నుంచి, కాలుష్యం చెర నుంచి ప్రజలను బయట పడేయాలన్నది దివంగత నేత యాల్ల రాములు కల అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆలూరు బైపాస్ రోడ్ లో శుక్రవారం దివంగత నేత యాల్లరాములు నిలువెత్తు విగ్రహాన్ని జీవన్ రెడ్డి ఆవిష్క రించారు. జీవన్ రెడ్డి కి స్వయాన మేన మామ అయిన యాల్ల రాములు 1994 సంవత్సరంలో ఆర్మూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆ పదవిలో ఉన్న సమయంలోనే 1996వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి పుణ్యక్షేత్రంకు వెళ్లిన యాల రాములు తిరుగు ప్రయాణంలో కర్నూలు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ దుర్ఘటనలో రాములుతో పాటు ఆయన సతీమణి యాల రమాదేవి, కారు డ్రైవర్ రమా గౌడ్ లు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఆర్మూర్ ప్రాంతంలో మంచి రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందిన రాములు విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన ఆయన కుమారుడు నరేందర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆలూరు బైపాస్ రోడ్డులో నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజితారెడ్డి లతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నివాళులర్పించారు. విగ్రహ ప్రతిష్టాపన చేసిన అనంతరం జీవన్ రెడ్డి ఇదే రోడ్డులో యల్లా రాములు బస్టాప్ ను ప్రారంభించారు. తరువాత బైపాస్ రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసిన హైమాక్స్ లైటింగ్ సిస్టంను, సీసీ కెమెరాల విభాగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన భారీ సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్వయాన తన మేనమామ అయిన దివంగత నేత రాములు స్ఫూర్తితో ముందుకు సాగుతానన్నారు. ఆలూరు బైపాస్ రోడ్డు నిర్మించాలన్న రాములు మామ కలను సాకారం చేసి రుణం తీర్చుకున్న.
ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో ఆలూరు రోడ్డు వేయించా. మొదట భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించారు. నిరసనగా ధర్నాలు, దీక్షలు చేశారు. బైపాస్ రోడ్డు వస్తే భూముల ధరలు పెరుగుతాయని రైతులకు నచ్చ చెప్పా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి నష్టపరిహారం పెంచాం. నేను అధికారులు రైతులను ఒప్పించి, మెప్పించి బైపాస్ రోడ్డు కోసం భూసేకరణ పూర్తి చేశాం. ఆలూరు రోడ్డు నిర్మాణం విశాలంగా జరిగింది. రోడ్డుకిరువైపులా లైట్లు, సీసీ కెమెరాల ను ఏర్పాటు చేశాం.ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంతో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మా రాములు మామ ఆత్మ శాంతించింది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టుక నీది చావు నీది, బతుకంతా దేశానిది అన్న విధంగా దివంగత రాములు బతికినంత కాలం ప్రజల కోసమే తపించారన్నారు.
ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ఆయన ముందుండే వారన్నారు.
ఆర్మూర్ అభివృద్ధిలో రాములు పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.
దివంగత రాములు స్పూర్తితో ముందుకు సాగుతానని జీవన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజితారెడ్డి లు కలిసి వేదికపైన దివంగత నేత రాములు కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను ప్రధానం చేశారు. ఇదిలావుండగా
ఈ రోడ్డుకు యల్లా రాములు బైపాస్ రోడ్డుగా, ఆలూరు చౌరస్తాకు యల్లా రాములు చౌక్ గా నామకరణం చేశారు.
కాగా అక్కడ అభిమానులకోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను జీవన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మార్క్ ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి, మాజీ ,జడ్పీటీసీ గంట సదానందం, మాజీ సర్పంచ్ కొంగి సదశివ్ , మున్సిపల్ ఛైర్పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్ చైర్మన్ మున్ను, డాక్టర్ శంకర్, బీఆర్ కే రాజు, కటిపెళ్లి వెంకట్ రెడ్డి సోదరులు, దివంగత రాములు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు తెల్లవారుజామున అరెస్టు అయ్యే అవకాశం.

మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు నిరసనగా టిఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న...

జనరల్

సంగారెడ్డి బార్ అసోసియేషన్ తరపున డైరీల వితరణ..

తెలంగాణ వార్త:: ఆర్మూర్ న్యాయవాదులకు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గత మూడు సంవత్సరాల నుండి...

జనరల్

కత్తులతో నరికి చంపారు..

తెలంగాణ వార్త:: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం ఉదయం దారుణ హత్య జరిగింది....

జనరల్

నిజామాబాద్ లో దొంగలు పడ్డారు..

తెలంగాణ వార్త::: నిజామాబాద్ నగరంలో మంగళవారం రాత్రి దొంగలు రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. పెద్దపోస్టాఫీస్‌...

You cannot copy content of this page