తెలంగాణ వార్త:: ఈరోజు ఆర్మూర్ పట్టణంలో హోలీ పండగ ను పురస్కరించుకొని జీ జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా మిత్రులకు ఆర్గానిక్ రంగులు పూసి హోలీ శభాకాంక్షలు తెలిచేయడం జరిగింది అనతరం నివేదన్ మాట్లాడుతూ హోలీ అనేది పాల్గున మాసంలో పూర్ణిమ నాడు వస్తుందని హోలీ కి మరో పేరు కామిని పున్నమి అని కూడా పిలవడం జరుగుతుంది పూర్వం రఘు రాజ్యంలో హోళికా అనే రాక్షసి రాజ్యంలో వున్నటువంటి ప్రజలను క్రూరంగా చంపెస్తు వుండేది అప్పుడు రాజు ప్రజలను రక్షించే ప్రయత్నoలో భాగంగా అయొక్క రాక్షసిని హతమార్చడం జరిగింది కాబట్టి ఆరోజు నుండి నేటి వరకు కూడా యావత్తు భారతదేశంలో హోలీ పండగను అందరూ ఎంతో ఉత్సవంతో,ఆనందంగా,చిన్న పెద్దా వయసుతో తేడా లేకుండా హోలీ పండగను జరుపుకోవడం మన హిందూ సాంప్రదాయం అని కొనియాడారు ఇట్టి కార్యక్రమంలో అల్జపుర్ గిరి, గాయకుడు శ్రవణ్, నర్సింహచారి,కిషన్ గౌడ్ ,దాచేపల్లి సంతోష్ ,జీవన్ గౌడ్ , డి.కే అరవింద్ తదితరులు పాల్గొన్నారు
Leave a comment