Home జనరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గురుపూజోత్సవం కార్యక్రమం..
జనరల్

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గురుపూజోత్సవం కార్యక్రమం..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ట్రస్మ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ భాషిత సుందర్, మండల అధ్యక్షులు భరత్ చంద్ర మల్లయ్య, ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమ కన్వీనర్ మానస గణేష్ లు మాట్లాడుతూ ఆదివారం రోజున పెర్కిట్ లోని జి.ఆర్ గార్డెన్స్ లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల నుండి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందని వారిని రేపు ఘనంగా సన్మానించడం జరుగుతుందని వారు అన్నారు. కార్యక్రమంలో మొదటి సెషన్ లో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ప్రముఖ శిక్షకుడు శ్రీనివాస్ రెడ్డి చేత బోధన మెలకువలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందని వారు అన్నారు. ఆర్మూర్ ని తెలంగాణలోనే ఒక గొప్ప ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దుతూ వారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఏసీపీ బసవ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారాం మరియు ట్రస్మా రాష్ట్ర, జిల్లా బాధ్యులు హాజరవుతారని వారు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ పత్రిక సమావేశంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం కమిటీ సభ్యులు జెంటిల్ కిడ్స్ ప్రకాష్ , ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి విద్యా ప్రవీణ్ కోశాధికారి స్కాలర్స్ వేణు, శ్రీ చంద్ర నారాయణ, భార్గవి గోపి, నలంద ప్రసాద్ , శ్రీ స్కూల్ మల్లేష్ గౌడ్, ప్రజ్ఞ వంశీ లు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page