Home జనరల్ సరైన గురువు ఉంటే చిన్న దీపం కూడా సూర్యుడిలా ప్రకాశించగలదు. రవీందర్ యాదవ్.
జనరల్

సరైన గురువు ఉంటే చిన్న దీపం కూడా సూర్యుడిలా ప్రకాశించగలదు. రవీందర్ యాదవ్.

గురువే అందరికి మార్గదర్శి, బాటసారి.. భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్.

తెలంగాణ వార్త::గురువు లేకపోతే జీవితంలో ఎవరూ సక్సెస్ కాలేరని, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రూపంలో గురువు ఉంటారని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. గురువు ఆశీర్వాదంతోనే జీవితానికి సన్మార్గం దొరుకుతుందని వెల్లడించారు. విజయవంతమైన జీవితానికి గురువే పునాదిగా నిలుస్తారని కొనియాడారు. టీచర్స్ డే సందర్భంగా గురువారం మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఎనిమిది మంది టీచర్స్ ను ఘనంగా సత్కరించి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులది ప్రత్యేక పాత్ర అన్నారు. జీవితంలో మొదటి గురువు తల్లి.. అక్కడి నుంచి పాఠశాలలో విద్య నేర్పిన ప్రతి గురువు మన జీవితంలో ఎదుగుదలకు కారకులు అవుతారన్నారు. మనకు జ్ఞానాన్ని బోధించి, ముందుకు సాగడానికి సన్మార్గ బోధన చేసేది గురువు మాత్రమేనని వెల్లడించారు. ఏమి ఆశించకుండా తల్లి, తండ్రుల తర్వాత మన ఎదుగుదలను కొరుకునేది టీచర్స్ అని కొనియాడారు. విద్యార్ధి దశలో ఉపాధ్యాయులు చూపే మార్గమే వారికి భవిష్యత్ ను నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఉంటారని, మన ఎదుగుదలకు బాటలు వేసిన వారికి ఉన్నత స్థానంలో ఉండి వారికి సంతోషాన్ని ఇవ్వాలన్నారు. సరైన మార్గదర్శకుడు ఉంటే చిన్న దీపం కూడా సూర్యుడిలాగా ప్రకాశించగలదని రవీందర్ యాదవ్ అన్నారు. అనంతరం స్కూల్ లోని వసతులు, విద్యార్థుల గురించి అడిగి తెలుససుకున్నారు. విద్యా బోధన, స్కూల్ సాధించిన విజయాలను ఉపాధ్యాయులు రవీందర్ యాదవ్ కు వివరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page