ఆర్మూర్, తెలంగాణ వార్త: 22 సం”లుగా వేరుగా ఉన్న రెండు సర్వ సమాజ్ కులాల వారిని “ఒకే సర్వ సమాజ్ గా చేసిన ఘనత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కే దక్కింది.
గత 22 సంవత్సరల క్రితం ఆర్మూర్ పట్టణంలో ప్రజా ఐక్య సమితి సమాజ్ రెండు భాగాలుగా విడిపోయింది.
ఆర్మూర్ పట్టణంలో 22 సంవత్సరాల నుండి రెండు సర్వ సమాజ్ లు కులాల వారిగా విడిపోయి అధ్యక్షులని ఎన్నుకుంటున్నారు.
ఈ రోజు ఆ ఇద్దరి అధ్యక్షులను మరియు కుల సంఘాల పెద్దలను (ఆర్మూర్ ప్రజా ఐక్య సమితి సమాజ్ మరియు 16 కులాల సర్వ సమాజ్) ఏకధాటిగా ఒకే వేదికపై కూర్చోబెట్టి ఇదివరకు జరిగిన తప్పులను తమకు తామే సర్దుకొని ఒకే సమాజ్ గా ఉండాలని కోరడం జరిగింది.
కోరిన వెంటనే వారు ఒకటి గానే ఉండేటట్టు కుల సంఘాల మధ్యలో నిశ్చఇంచుకున్నారు
ఈ భేటీ వల్ల ఆర్మూర్ పట్టణంలో సర్వసమాజ్ ఒకటిగానే ఉండబోతుందని రెండు సర్వ సమాజ్ కులాల వారిని “ఒకే సర్వ సమాజ్ గా చేసిన ఘనత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కే దక్కిందని పట్టణ ప్రజలు, కుల సంఘాల నాయకులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు
Leave a comment