ఆర్మూర్, తెలంగాణ వార్త::
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి రాష్ట్ర హోంశాఖ అదనపు భద్రత కల్పించాలి.
“తెలంగాణ మాదిగ మహాసేన” సంఘం జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి.
ఆర్మూర్ న్యూస్ ఆగస్టు03: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిపై హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని “తెలంగాణ మాదిగ మహాసేన” సంఘం జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి విలేకరుల సమావేశంలో అన్నారు.
ఈ సందర్భంగా “తెలంగాణ మాదిగ మహాసేన” సంగం జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి మాట్లాడుతూ.. ఇది రాజకీయంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని పిరికిపందల చర్య అని, 24/7 రోజులు ప్రజల కోసం వారి బాగోగుల కోసం ఆలోచించే వ్యక్తిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కల్లేడి గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ పై చట్ట రీత్యా తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ మహాసేన జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి కోరారు. ప్రసాద్ గౌడ్ నిర్వహించిన రెక్కీ పై, హత్య ప్రయత్నం పై చాలా అనుమానాలు ఉన్నాయని ఆయన నేపాల్ వెళ్లి సుపారి గ్యాంగ్ లతో సంబంధాలు పెట్టుకుని,తుపాకులు,కత్తులు సమకూర్చుకునే స్థాయికి వెళ్ళాడంటే అతని వెనక నుంచి ఎవరో “ఎమ్మెల్యే గారిని హత్య చేయించడానికి సహకారం అందిస్తూన్నారనే అనుమానం కలుగుతోందన్నారు,ఇట్టి విషయమై పోలీస్ అధికారులు నిందితున్ని విచారించి ఈ కుట్ర వెనక ఉన్న వారందరినీ వెలికి తీయాలని, ఆయన వెనక ఉన్నది ఎంతటి వారైనా కటినంగా శిక్షించాలని కోరారు, ఇటువంటి చర్యలతో జీవన్ రెడ్డి గారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తే ఖబర్ధార్ అని హెచ్చరిస్తున్నాము, దమ్ము దైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో తెల్చుకోవాలి కానీ ఇటువంటి కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. హైద్రాబాద్ లో గాని, ఆర్మూర్ నియోజకవర్గంలో గానీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు జీవన్ రెడ్డి గారికి కట్టుదిట్టమైన భద్రత పెంచి అదనపు భద్రత కల్పించాలని డి.ఐ.జి ఆఫ్ పోలీస్ గారిని, రాష్ట్ర హోం శాఖ మంత్రి గారిని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో “తెలంగాణ మాదిగ మహాసేన” సంగం నాయకులు పొన్నాల చంద్రశేఖర్,బొడ్డు గోపి, భాస్కర్, శ్రీనివాస్, పోన్నాల రాజన్న తదితర నాయకులు పాల్గొన్నారు.
Leave a comment