(తెలంగాణ వార్త) తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉచ్చులో చిక్కుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గత వారమే ఆయనపైన ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్ నేరుగా యూనివర్శిటీకి వెళ్ళి ఆయన ఛాంబర్లో సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో ఏమేం వివరాలు దొరికాయన్నది గోప్యంగానే ఉండిపోయింది.
ఈ పరిస్థితుల్లో శనివారం ఉదయం హైదరాబాద్ నివాసంలో వీసీ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా దొరికారు. నియామకాల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనేది ఆయనపై వచ్చిన ఆరోపణలు. ఏసీబీ ట్రాప్కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నది.
Leave a comment