సిద్దిపేట అర్బన్ 10, శుక్రవారం( తెలంగాణ వార్త)
బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి 126 వ వర్ధంతిని బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. సంఘసంస్కర్త, భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన గొప్ప ధీరవనిత , కేవలం చదువుదారు మాత్రమే బ్రతుకులు మారుతాయి అని నమ్మి తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి 1948లో మొట్టమొదటిసారిగా సత్యశోధకునూ ఏర్పాటుచేసి ఎంతోమంది మహిళలకు చదువును నేర్పినటువంటి మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి లింగంపల్లి యాదగిరి ,జిల్లా కోశాధికారి రోమాల బాబు, నియోజకవర్గ ఇన్చార్జ్ బాకూరి అశోక్, నియోజకవర్గ కోశాధికారి పొన్నాల నర్సింహులు, సిద్దిపేట పట్టణ అధ్యక్షులు ఈర్ల మల్లేశం ముదిరాజు గారు పాల్గొన్నారు.
Leave a comment