నందిపేట్., తెలంగాణ వార్త::
త్యాగనిరతిని చాటే బక్రీద్ ఈద్ (ఈద్-ఉల్-జుహా) పండుగను జిల్లావ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. బక్రీద్ సందర్భంగా ఆదివారం ఉదయం ముస్లింలు మస్జీద్ లలో ప్రార్థనలు చేశారు. ఈద్గాహ్ కు వెళ్లి నమాజు చదివే ఆచారం ఉన్నప్పటికీ వర్షం కారణంగా మస్జీద్ లలోనే చదివారు.
ఇబ్రహీం అలైసలాం తన కుమారుడు అయిన ఇస్మాయిల్ ను దైవమార్గంలో బలి ఇచ్చేందుకు ఉపక్రమించటం ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ఇస్మాయిల్ బదులుగా మేకను పోలిన జీవన్నీ ఉంచడం జరిగింది. ఇబ్రహీం అలైహి సలాం యొక్క త్యాగ పరీక్ష ను గుర్తుచేసుకోవడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం అని ధార్మిక పండితులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ నాడు ఈద్గాహ్ ల వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరినొకరు అలై బలయి చేసుకొని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొనే ఆచారం ఉండేది కానీ వర్షం మూలంగా మస్జీద్ లలోనే ప్రార్థనలు చేశారు . అనంతరం ఇంటికి వెళ్లి మేకలు, గోర్లు వగైర జీవలను ఖుర్బానీ చేసి అట్టి మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగం పేదలకు, మరో భాగం బంధువులకు పంచి,మిగిలిన ఒక భాగాన్ని ఇంటి వారితో కలిసి విందులు చేసుకొన్నారు. అధికారులు పలువురు రాజకీయ పార్టీ నాయకులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట్ మండలములోని జమే మస్జీద్, ఇబ్రహీం మస్జీద్, రహమనియా మస్జీద్, మౌజా బింతే అలీ , ఖుదా న్పూర్, వన్నెల్, దొంకేశ్వర్, నుత్పాల్లి, తొండకూర్, అయిలపూర్, మల్లరం తదితర గ్రామ లలో ముస్లింలు భక్తి శ్రద్దలతో బక్రీద్ పండుగ జరుపుకొన్నారు. ఎం పి పి వాకిడి సంతోష్, మండల కో అప్సన్ మెంబర్ సయ్యద్, మండల్ ముస్లిం కమిటీ ఆధ్యక్షుడు కలీమ్ , జమాత్ ఏ ఇస్లామి హింద్ నాయకులు షేక్ గౌస్ ప్రజలకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు
Leave a comment