ఆర్మూర్ (తెలంగాణ వార్త)ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్మూర్ పట్టు చేనేత ఖత్రీ కార్మికులను గుర్తించి వారికి బీజేపీ ఆర్మూర్ శాఖ తరపున మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ గారు ఘనంగా సత్కరించి సన్మానం చేశారు.
అంతరించి పోతున్న పట్టు చేనేతను ఆదుకోవాలని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పునర్నిర్మించాలని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను ఆదుకొని మరమగ్గాల ను పునః ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు పింఛన్ తక్షణమే ఇచ్చి వారిని ఆదుకోవాలని మరియు భవన నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ వచ్చిన గాని ఎందుకు తక్షణమే నిర్మాణము చేపట్టలేదు ఇప్పుడు డు వెంటనే నిర్మాణం చేపట్టాలి.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బిజెపి అధ్యక్షులు జస్సు అనిల్, నరసింహారెడ్డి , షికారి శ్రీనివాస్ పుప్పాల పోశెట్టి పాన్ శ్రీనివాస్ ఆకుల రాజు సడక్ మోహన్ జక్కం పోశెట్టి కృష్ణ గౌడ్ శైలేష్ వెన్న మోహన్ భాషెట్టి దయాల్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment