“దివ్య కాశీ — భవ్య కాశీ” అయిన గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమైన పవిత్ర కాశీ నగరాన్ని పునరుజ్జీవింప చేయడానికై గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కాశీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, చేపట్టినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రాజారాంనగర్ లో ఉన్న శివ పంచాయతన శివాలయం లో శివునికి అభిషేకం చేసి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడమైనది.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ పవిత్ర కాశీ నగరాన్ని విస్మరించిందని, 240 సంవత్సరాల క్రితం రాణి అహల్యాబాయి హోల్కర్ ఈ కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి పరిస్తే మళ్ళీ ఈనాటికీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పవిత్ర కాశీ నగరాన్ని అభివృద్ధిపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని. హిందువుల పవిత్ర స్థలం అయినటువంటి కాశీ క్షేత్రాన్ని గౌరవ ప్రధాన మంత్రి గారు అభివృద్ధి పరచడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ హిందూ బంధువులందరికీ అభినందనలు తెలియజేస్తూ. నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరం ఎన్నికలలో కాశీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సందర్భంగా వారు మాట్లాడుతూ “ఇక్కడ పోటీ చేయమని తనను ఎవరు పంపలేదని, నాకు నేనుగా కూడా ఇక్కడ పోటీ చేయాలని అనుకోలేదని, గంగమ్మ తల్లి పిలిచిందని ఆ పిలుపునకు తాను స్పందిస్తూ కాశీ నుండి పార్లమెంట్ కు పోటీ చేయడం అయిందని, తాను తల్లి ఒడికి చేరిన బిడ్డలా అనుభూతి పొందానని” చెప్పడం జరిగింది.
ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి కాశి క్షేత్రం ఇంకా మరింత అభివృద్ధిలో నడవాలని, “దివ్య కాశీ — భవ్య కాశీ” ఓ నినాదంగా మాత్రమే కాకుండా దాని వెనుక స్పష్టమైన లక్ష్యం, మంచి ఆలోచనలతో కూడిన కార్యాచరణ చేపట్టి ప్రపంచంలోనే ఓ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు బూసం ప్రతాప్, భారతీయ జనతా మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు, కౌన్సిలర్ కొంతం మంజుల మురళి, భారతీయ జనతా దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ఉపాధ్యక్షులు పెద్దోళ్ల భరత్, దళిత మోర్చా ఆర్మూరు పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్, సైవేరాజు, శ్యామ్, ప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Leave a comment