పి యు సి చైర్మన్ జీవన్ రెడ్డి.
హైదరాబాద్( తెలంగాణ వార్త )బిజెపి జాతీయ రాజకీయ పార్టీ లా లేదని సర్కస్ కంపెనీ గా కనిపిస్తుందని పి యు సి చైర్మన్ ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ లో లో బిజెపి పార్టీ ఒక సర్కస్ కంపెనీ లా మారిందని ఎద్దేవా చేశారు. ముంబై సర్కస్ కంపెనీ లా ఆర్టిస్టుల జోకర్ గా మారారు అని బిజెపి పై తీవ్రస్థాయిలో పి వి సి చైర్మన్ జీవన్ రెడ్డి ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బిజెపి నాయకులు టచ్ చేస్తే దేశం అగ్నిగుండంగా మారుతుందని చైర్మన్ హెచ్చరించారు. బిజెపి నేత మురళీధర్ రావు కూడా కేసీఆర్ను అవినీతిపరుడు అంటున్నారు కాలేశ్వరం ప్రాజెక్టులో జైలుకు పంపుతామని అన్నారు. .రేవంత్ రెడ్డి పార్లమెంటులో ప్రశ్న అడిగితే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కేంద్రం బదులిచ్చింది. టికెట్లు అమ్ముకున్న మురళీధరరావు పై పోలీస్స్టేషన్లో కేసులు ఉన్నాయి కెసిఆర్ ఉద్యమ కారుడు అని కెసిఆర్ ని టచ్ చేసి చూడండి తెలంగాణతోపాటు దేశం కూడా అగ్నిగుండంగా మారుతుంది ఇది అని పి యు సి చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు
Leave a comment