Home జనరల్ బి.ఆర్.ఎస్ నాయకులు రవీందర్ యాదవ్ కు “డాక్టరేట్”ది అమెరికన్ యూనివర్సిటీ” (యూఎస్ఏ)…
జనరల్

బి.ఆర్.ఎస్ నాయకులు రవీందర్ యాదవ్ కు “డాక్టరేట్”ది అమెరికన్ యూనివర్సిటీ” (యూఎస్ఏ)…

శేరిలింగంపల్లి మార్చి 9 (తెలంగాణ వార్త) ది అమెరికన్ యూనివర్సిటీ” (యూఎస్ఏ) సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ సేవలకు గాను రవీందర్ యాదవ్ కి “ది అమెరికన్ యూనివర్సిటీ” (యూఎస్ఏ) వైస్ ఛాన్స్లర్ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్టానికి చెందిన రవీందర్ యాదవ్ కి ధక్కిన గౌరవ డాక్టరేట్. నిస్వార్థ సమాజసేవకుడు, నిరుపేదలకు సహాయం చేసి చేయూత అందించడం వంటి సేవలు అద్వితీయమంటూ అభివర్ణించిన అతిథులు, కార్యక్రమ నిర్వాహకులు, తెలంగాణ రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కు చెందిన రవీందర్ యాదవ్ కు ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమి సంస్థ స్థాపించి పలు సేవ కార్యక్రమలు కొనసాగించిన ఆయన ఈ పురస్కారానికి ఎంపిక కావడం గమనార్హం.

నిరుపేదలకు విద్యా వైద్యం కృషి చేయడంతో పాటు సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థ సేవలను నిర్వర్తిస్తున్న రవీందర్ యాదవ్ ని డాక్టరేట్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు బెంగుళూరు నగరం లోని గాంధీ భవన్ లో గల బాపు హాల్ లో నిర్వహించిన కార్యక్రమం లో డాక్టరేట్ అవార్డ్ ను ది అమెరికాన్ యూనివర్సిటీ ప్రధానఁ చేసింది యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొతిమ మధు కిషన్ చేతుల మీదుగా రవీందర్ యాదవ్ ఇంటర్నేషనల్ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు, కొరియా కు చెందిన శాంతి రాయబారులు జాసన్ ఛాలీసా కిమ్. కర్ణాటక కు చెందిన శాంతి రాయబారులు డాక్టర్ సెల్టా డాక్టర్ సత్యమూర్తి తదితరులు రవీందర్ యాదవ్ ని ఘనంగా సత్కరించి పురస్కారంతో పాటు పతకం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వకులు మాట్లాడాతు. సమాజ సేవలో రవీందర్ యాదవ్ అభినందనీయుడని కొనియాడారు. తన సమయంలో సింహభాగం సామాజిక సేవా కార్యక్రమాల కోసం సద్వినియోగం చేస్తున్న రవీందర్ లాంటి సోషల్ వర్కర్స్ సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన సేవలు కొనసాగుతున్నాయని కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజాసేవే తన అభిమతంగా భావించి ఎందరో నిరుపేదలకు తన శక్తివంచన మేరకు రవీందర్ యాదవ్ సేవలందించారని అన్నారు. ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం సామాజిక సేవా సుగుణానికి అద్దం పడుతున్నదని అభివర్ణించారు. అన్ని కాలాల్లో ఆయన సేవలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి అన్నారు.
మండుటెండల్లో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, ఎముకలు కొరికే చలిలో నిర్భాగ్యులకు దుప్పట్లు పంపిణీ, వానాకాలంలో కడు పేదలకు, యాచకులకు ఆహారం పంపిణీ చేయడం కార్యక్రమాలను తన మదిలో చిరకాలం నిలిచిపోతాయని అన్నారు. కాగా తన సేవలను గుర్తించి డాక్టరేట్ పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి తనను ఎంపిక చేసిన నిర్వకులకు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు తెలంగాణ సోసియో కల్చరల్ అకాడమీ చైర్మన్ రవీందర్ యాదవ్
తెలిపారు. ఈ అవార్డు స్వీకరణ అనంతరం తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిండు నూతనోత్సాహంతో ఇంకా బాగా కష్టపడి సమాజ అభ్యున్నతి కోసం పాటుపడతానని అన్నారు. తన అమ్ముల పొదిలో మరో అవార్డు వచ్చి చేరిందని, డాక్టరేట్ పురస్కారం తనకు దక్కడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉన్నదని . రవీందర్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డ అన్న మంత్రి కి కెసిఆర్ హ్యాండిచ్చారు..

హైదరాబాద్ (తెలంగాణ వార్త) పాలమ్మినాపూర్ కష్టపడ్డ అని చెప్పిన మల్లారెడ్డి ఇక టిఆర్ఎస్ పార్టీ నుంచి...

జనరల్

బిజెపి, బిఆర్ఎస్ అలై భలై.. ప్రతిపక్షం ఒక్కటే కాంగ్రెస్ కు కలిసి వచ్చెనా…

హైదరాబాద్ (తెలంగాణ వార్త) బిజెపి బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం...

జనరల్

రేపు విద్యుత్ విజయోత్సవ సభలు..

నిజామాబాద్(తెలంగాణ వార్త)జూన్ 04: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం విద్యుత్...

జనరల్

ఆదర్శంగా నిలుస్తున్నజర్నలిస్ట్ కాలనీ. అభివృద్ధికి నిధులుఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి…

ఆర్మూర్ ( తెలంగాణ వార్త )ఆర్మూర్: ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం...

You cannot copy content of this page