హైదరాబాద్( తెలంగాణ వార్త) ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత కు ఈడి నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా నోటిఫికేషన్ జారీ చేసింది. విచారణ నేపథ్యంలో ఈ డి కవితను అరెస్టు చేస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది .ఈరోజు రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానిక బి ఆర్ఎస్ నేతలు హైదరాబాద్కు రావాల్సిందిగా కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే కర్ణాటక తో పాటు తెలంగాణ ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఒకవేళ కవిత అరెస్టు అయితే ముందస్తు ఎన్నికలకు తప్పవని సమాచారం.
Leave a comment