హైదరాబాద్త, తెలంగాణ వార్త: కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో పాత బస్ డిపో స్థితిగతులు దయనీయంగా మారాయి. బస్సులను పార్కింగ్ చేసేందుకు తగిన స్థలం లేకపోవడంతో పాటు, రాత్రిపూట వివిధ జిల్లాల నుండి వచ్చే సుమారు 40 బస్సులకు పార్కింగ్ కష్టతరంగా మారింది. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో బస్టాండ్ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


దశాబ్ద కాలంగా స్థానిక ప్రజలు హెచ్ఎంటీ స్థలంలో కొత్త బస్ డిపో నిర్మించాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. 2017 ఎంపీ ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కొత్త డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దాన్ని అమలు చేయకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
నూతన బస్ డిపో నిర్మాణానికి సంబంధించి ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఆకుల సతీష్ టీం మరియు జగద్గిరిగుట్ట బస్ డిపో సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ, “గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. మెనీ తెలంగాణగా పేరొందిన జగద్గిరిగుట్టకు 10 ఎకరాల్లో నూతన బస్ డిపో నిర్మించి ప్రజలకు వాహన సౌకర్యాన్ని అందించాలి,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్ల జై శంకర్ గౌడ్, ఆంజనేయులు, అమలేశ్వరి, శ్రీనివాస్ గౌడ్, అరుణ్ రావు, సుభాష్, లానా, విశాల్, పనింద్ర, సంతోష్, శివ గౌడ్, ఈశ్వర్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.
Leave a comment