తెలంగాణ వార్త, హైదరాబాద్: పాస్ పోర్ట్ తీయాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
పాస్ పోర్ట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 1980 నాటి పాస్ పోర్ట్ రూల్స్ సవరణ చేసింది. పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో జన్మ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త రూల్స్ లో పేర్కొన్నారు. సవరించిన నిబంధనల ప్రకారం 2023 అక్టోబర్ 1 కన్నా ముందు జన్మించిన వాళ్లు బర్త్ సర్టిఫికెట్ను ప్రూఫ్ గా ఇవ్వాలని పేర్కొన్నారు మున్సిపార్టీల్లో ఇచ్చే భర్త సర్టిఫికెట్లు లేదా మెట్రిక్యులేషన్ స్కూల్ సర్టిఫికెట్లు లేదా పాన్ కార్డు లేదా ఎల్ఐసి బీమా పాలసీ పత్రాలు ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రం రిజిస్టర్ ఆఫ్ బర్డ్స్ అండ్ డెత్ లేదా మున్సిపల్ కార్యాలయంలో లేదా ఇతర అధికారుల చేత జనన ధ్రువీకరణ పత్రాలు సరిపోతాయని నోటిఫికేషన్ తెలిపారు.

Leave a comment