ఆర్మూర్, తెలంగాణ: వార్త: ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ అడిషనల్ డిసిపి బసవ రెడ్డి కఠిన ఆంక్షలు విధించారు. ఆర్మూర్ అడిషనల్ డీసీపీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ వార్తతో మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజన్ బల్బ్స్తో తో గణేష్ నిమజ్జనాన్ని చేయవద్దని భక్తిశ్రద్ధలతో మరియు భక్తి పాటలతో మైకు ద్వారా నిమజ్జనం నిర్వహించాలని అడిషనల్ డిసిపి అన్నారు. డిజె సౌండ్ వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, హార్ట్ ఎటాక్ వచ్చే సూచనలు ఉన్నాయని ప్రజలు దీన్ని గ్రహించి గణేష్ నిమజ్జనం చేయాలని ఆయన సూచించారు. గణేష్ మండలి వారికి నోటీసులు జారీ చేశామని నోటీసులను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికి చేయాలని వారు సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా స్పీకర్ సౌండ్స్ నిర్వహించద్దని ఆయన గణేష్ మండలి వారు సహకరించాలని ఎ.సి.పి కోరారు.
ఇలాంటివి తెలంగాణలో చాలా జరుగుతున్నాయి గణేష్ మండపల వారు మరియు ప్రజలు గ్రహించగలరు. నిమజ్జనం సమయంలో భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం కి తీసుకెళ్తే అందరికీ మంచిది.
Leave a comment