హైదరాబాద్, బైంసా, ముధోల్, తెలంగాణ వార్త: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని దేవాదాయ భూములను కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ముధోల్ బిజెపి నేత బద్దం భోజ రెడ్డి తెలిపారు..దేవాదాయ భూముల్ని కాపాడవలసింది పోయి హిందువులే దేవాదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తే చట్టనిత్యాచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరైనా అలాంటి భూములను కొనుగోలు చేసిన అమ్మిన వారిపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు భూములు కొన్నవారు రిజిస్ట్రేషన్ పేపర్లను ఒకటికి నాలుగు సార్లు చూయించుకొని ఆ భూముల సక్రమంగా ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒకవేళ దేవాదాయ శాఖ భూములైతే మాత్రం హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్లి వాటిని వెనక్కి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు
9440023558 మోహన్ సాయి
Leave a comment