Home జనరల్ <em>తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ</em>
జనరల్

తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ

  • స్వరాష్టం ఏర్పడి 8 ఏండ్లు దాటినా ఇప్పటి వరకు అనేక మందికి కనీసం ఇండ్లు లేవు , కరెంటు లేదు*
  • రానున్న రోజుల్లో రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది*
  • YSR తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్*

ఆర్ముర్, తెలంగాణ వార్త: నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ నియోజకవర్గ కేంద్రంలో YSR తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు పార్టీ నేతలతో కలసి పర్యటించారు.

ఆర్ముర్ పట్టణంలోని వివిధ కాలనీలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా పార్టీ నేతలకు సంప్రదించాలని , ప్రజల పక్షాన YSR తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

YSR గారు పేద ప్రజల కోసం పెన్షన్లు , ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని , రైతలకు ఉచిత కరెంటు , విద్యార్థులకు ఫీజు రియంబర్సుమెంట్ , జలయజ్ఞం వంటి గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను అదుకున్నారన్నారు.

మళ్ళీ ప్రజలంతా రాజన్న బిడ్డను ఆశీర్వదించి , రాజన్న పాలన తేవాలన్నారు .

ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్ టీ విభాగం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ , బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కిషన్ , సీనియర్ నాయకులు దినేష్ , మోనిత , రాధ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page