మంగళవారం బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి వ్యవసాయం చేస్తున్న రైతన్నకు భారంపై మంగళవారం పెద్ద ఎత్తున నందిపేట్ మండలంలో ధర్నా.
మంగళవారం రోజున నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పి వి సి చైర్మన్ జీవన్ ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ సూచన మేరకు నందిపేట మండల కేంద్రంలోని నంది విగ్రహం దగ్గర ఉదయం పది గంటలకి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి వ్యవసాయం చేస్తున్న రైతన్నలకు భారం చేకూరుస్తూ వ్యవసాయాన్ని అపహాస్యం చేస్తున్న వేళ రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని రైతు వ్యతిరేక ప్రభుత్వం పైన బీజేపీ వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ధర్నా కార్యక్రమం ఉంటుంది. కావున నందిపేట మండలంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ఎంపీపీ, జడ్పిటిసి వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ నెంబర్లు, సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు రైతు బంధు సమితి నాయకులు అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు రైతు విభాగం అధ్యక్షులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
Leave a comment