ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ పట్టణములోని SSK కల్యాణ మండపంలో గతములో జరిగిన యువజన సమాజ్ ఎన్నికల సందర్బంగా జరిగిన ఒప్పందం ప్రకారం జరిగిన అధికార మార్పిడిలో మంగళవారం రోజున ఆర్ముర్ యువజన సమాజ్ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన విశ్వనాథ్ శ్రీను రాజేష్ గారిని ముఖ్య అతిథి ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్అశన్నగారి రాజేశ్వర్ రెడ్డి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆశన్న గారి రాజేశ్వర్ మాట్లాడుతూ యువజన సమాజ్ సభ్యులు ఎన్నికల సమయములో చేసుకున్న ఒప్పందం ప్రకారం అధికార మార్పిడి చేసి అందరికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఇంకా మూడు పదవులకు ఒప్పందం ప్రకారం అధికార మార్పిడి జరిగింది వారికి కూడా రాజేశ్వరన్న సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ , ప్రాంతీయ క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్ , కార్యదర్శి పండిత్ ప్రేమ్ , కౌన్సిలర్లు జనార్దన్ రాజు , బాదాం రాజ్ కుమార్ , బారాడ్ రమేష్ , SSK సమాజ్ కార్యవర్గ సభ్యులు సాత్ పూతే శ్రీనివాస్ మరియు రాష్ట్ర ప్రాంతీయ యువజన సమాజ్ సహాయక కార్యదర్శి DK శ్రీహరి , SSK యువజన సమాజ్ అధ్యక్షులు GV ప్రశాంత్, ఉపాధ్యక్షులు ధోoడి అనిల్ కుమార్, కోశాధికారి కర్తన్ విశాల్, సాంస్కృతిక కార్యదర్శి గటడి ఖండోబా కార్తిక్, విద్యా కార్యదర్శి వాగ్లే దత్తాద్రి, వ్యాయమ కార్యదర్శి జి.పి.శ్రీకర్ మరియు ఉపాధ్యక్షులు బారడ్ శివ, సంయుక్త కార్యదర్శి దొండి సాయి, యువజన సమాజ్ కార్యవర్గ సభ్యులు సాత్ఫుతే సందీప్, పాల్గొనడం జరిగింది……
Leave a comment