హైదరాబాద్( తెలంగాణ వార్త )బ్రిటిష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం సికింద్రాబాద్ లో క్లబ్ ను నిర్మించారు .అది ఆదివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతి అయింది. .సికింద్రాబాద్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలను అదుపు చేసేందుకు పది అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా శ్రమించారు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేసేందుకు సుమారు నాలుగు గంటల సమయం పట్టింది క్లబ్బు లో లో అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు రూ 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. .అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారతీయ వారసత్వ సంపద గుర్తించి 2017 లో సికింద్రాబాద్ క్లబ్ పోస్టర్ కవర్ విడుదల చేశారు దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ ఉంది. సికింద్రాబాద్ క్లబ్ లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఈ క్లబ్ లో 5 వేలకు పైగా సభ్యత్వం ఉంది. 1878లో బ్రిటిష్ హయాంలో ఈ క్లబ్ ను నిర్మించారు.
Leave a comment