తెలంగాణ వార్త: గచ్చిబౌలిలోని గౌడిదొడ్డి రోడ్డు వద్ద తెలంగాణ ఎన్జీవోస్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కెన్యా, టాంజానీయా, బ్యాంకాక్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు అని సమాచారం మేరకు వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటి, హెచ్ టి ఎఫ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. 9 మంది ఫారెన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు .పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. తెలంగాణ ఎన్జీవోస్ కాలనీలో ఇంటి ఓనర్లు ఇండ్లను అద్దెకు ఇవ్వడంతో చాలా ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలంగాణ వార్త ముందే చెప్పింది. ఇంటి ఓనర్లు అద్దెకు ఇచ్చే వారి వివరాలు తెలుసుకోకుండా ఎక్కువ అద్దెకు ఆశపడి ఎవరికి పడితే వారికి అద్దెకు ఇవ్వడం వల్ల వ్యభిచారాలు జరుగుతున్నట్టు సమాచారం.

Leave a comment