పెర్కిట్ వి.డి.సి అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చే వాల్ భోజరాజ్ ను ఘనంగా సన్మానించిన జి జి ఫౌండేషన్
తెలంగాణ వార్త:, హైదరాబాద్, సిటీ బ్యూరో::
ఆర్మూర్ పట్టణంలోని జి జి ఫౌండేషన్ కార్యాలయంలో ఇటీవలే పేర్కిట్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (విడిసి) నూతన అధ్యక్షునిగా ఎన్నికైన క్షత్రియ ముద్దు బిడ్డ పెర్కిట్ వాస్తవ్యులు బచ్చేవాల్ భోజరాజ్ గారికి సోమవారం జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగిందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి mjf పేర్కొన్నారు అనంతరం బోజరాజ్ మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా క్షత్రియ కులానికి ఇట్టి అధ్యక్ష పదవి అవకాశం రావడం చాలా గొప్ప విషయమని,అభినందనీయమనీ కొనియాడుతూ పెర్కిట్ గ్రామ అభివృద్ధి కొరకు విడిసి సభ్యులను,మరియు పేర్కిట్ పట్టణ ప్రజలకు సైతం కలుపుకొని పెర్కిట్ గ్రామ అభివృద్ధికి తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వారు పేర్కొన్నారు అదేవిధంగా ఇట్టి సన్మానం ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియచేసిన లయన్ నివేదన్ కి ప్రత్యెక ధన్యవాదములు తెలిపినారు ఇట్టి కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు నారాయణ వర్మ , జి జి ఫౌండేషన్ ప్రతినిధులు అల్జాపూర్ రాజేశ్వర్, బేల్దారి శ్రీనివాస్, బొచ్కర్ వేణు, డీజే కాశీనాథ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment