భైంసా అల్లర్ల విషయంలో నలుగురు హిందువులు- లింగోజి, రాకేష్, విజయ్, క్రాంతిలపై టీఆర్ఎస్ సర్కార్ అక్రమంగా పి.డి యాక్టు కింద నిర్బంధించడాన్ని తప్పుపడుతూ నేడు గౌరవ హైకోర్టు కేసు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నాను. వారిని వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.
టీఆర్ఎస్-ఎంఐఎం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా హిందువులపై కక్షసాధింపు కిందనే పి.డి యాక్టు విధించిన విషయం కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది. ధర్మం కోసం, న్యాయం కోసం కోర్టులో బాధితుల పక్షాన వాదించిన న్యాయవాదులకు ధన్యవాదాలు.
భైంసా అల్లర్లు జరిగిన సందర్భంలో 26 మంది హిందువులపై 30 అక్రమ కేసులు బనాయించారు. అప్పట్లోనే ఈ కేసులను కోర్టు కొట్టేసింది. అయినా వీరిలో లింగోజి, రాకేష్, విజయ్, క్రాంతిలపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా పి.డి యాక్టును విధించి నిర్బంధించింది. దీంతో వీరు ఇన్ని రోజులుగా జైలులోనే ఉన్నారు
తెలంగాణలో పి.డి యాక్టు దుర్వినియోగం అవుతోంది. అసాంఘీక శక్తుల మీదు ప్రయోగించాల్సిన ఈ చట్టాన్ని ఒక వర్గాన్ని సంతృప్తి పర్చడం కోసం హిందువులపై ముఖ్యంగా బిజెపి, హిందూవాహిణి, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలపై ప్రయోగిస్తున్నారు.
మత ఘర్షణల సందర్భంలో పరస్పర దాడులు జరిగినా హిందువులపైనే కేసులు నమోదు చేసి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భైంసా అల్లర్ల విషయంలో హిందువులపై పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న బిజెపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, టీఆర్ఎస్ నాయకులకు కొందరు పోలీసు అధికారులు వంతపాడడం దురదృష్టకరం.
Leave a comment