తెలంగాణ వార్త :హైదరాబాద్ నగరంలో ఒకవైపు హైడ్రా పెద్దపెద్ద అంతస్థులను కూల్చుతుంటే మరోవైపు చెరువుల కబ్జా కొనసాగుతుంది. ఎంతటి వారైనా సహించేది లేదన్న హైడ్రా శనివారం రోజు అక్కినేని నాగార్జున కు చెందిన మూడున్నర ఎకరాలు కూల్చివేసింది. మరోవైపు గచ్చిబౌలిలో నీ శేర్లింగంపల్లి డివిజన్, కేశవ నగర్ లో చెరువును కబ్జా చేస్తూ కంచి వేసుకుని కబ్జాకు పాల్పడుతున్నారు. అలాగే కేశవ్ నగర్ పేదలకు ఇచ్చిన స్థలంలో బడాబాబులు ఐదు అంతస్తుల భవనాలను నిర్మించి పీ.జీ హాస్టల్లుగా మారుస్తున్నారు. పేదవారికి అంతో ఇంతో డబ్బు ఇచ్చి వారిని అక్కడ నుంచి వేరే చోటికి పంపుతున్నారు. దీనిపై తెలంగాణ వార్త షేర్ లింగంపల్లి లోని జిహెచ్ఎంసి కమిషనర్ ను సంప్రదించగా సమాధానం ఇవ్వకుండానే తమ సిబ్బంది వచ్చి పనులు ఆపుతుందని చెప్పడం కోస మెరుపు. జిహెచ్ఎంసి కమిషనర్ కు రాజకీయ నాయకులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టినట్టు కేశవ్ నగర్ ప్రజలు అంటున్నారు.
అక్రమ కట్టడాలు, కబ్జా చేసుకున్న చెరువు.
వార్త ఆగదు, నిజము దాగదు.
Leave a comment