కమల నెహ్రూ కాలనీ ఆర్మూర్ డివిజన్ బచ్చ పల్లి దేవన్న.
ఆర్మూర్ (తెలంగాణ వార్త )దళిత బంధు పథకం రూపొందించి దళితుల ఆత్మబంధువు అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే అని అని ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ డివిజన్ నాయకులు బచ్చ పల్లి దేవన్న తెలిపారు. ఆర్మూర్ పట్టణం కమలా నెహ్రూ కాలనీ లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత 75 సంవత్సరాల పాలనలో దళితులను దృష్టిలో పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఇది జగమెరిగిన సత్యం అని ఆయన అన్నారు. దళిత బంధు రైతుబంధు రైతు బీమా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఆసరా పెన్షన్ లాంటి తదితర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా రూపొందించి కేసీఆర్ గారికి దళిత బంధు పథకం రూపొందించి అమలు చేయడం కష్టమైన పని కాదు అని రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారినా అని ఆయన విలేకర్ల సమావేశంలో అని పోయారు. దళిత బంధు పై ప్రతిపక్షాల తీరు అవ్వ పెట్టదు డొక్కా తినని యదు అన్నట్లుగానే ఉంది వారు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలిన వారే ఇప్పటికి వెళ్తున్న వారే వారి ఏలుబడిలో ఏ ఒక్క రోజు దళిత పక్షాన ఆలోచించి దళిత బందు అంత పెద్ద పథకం కాకపోయినా ఒక చిన్న అబద్ధం కూడా దళితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపొందించలేదు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే సంపన్న వర్గాలు సకల జనులు సమానంగా అభివృద్ధి చెందాలని కాంక్షించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించిన సమాజానికి న్యాయం కోసం నడుము కట్టాలన్నారు. అందుకే ప్రపంచం గర్వించదగ్గ దేశం ఆచరించదగ్గ సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయగలుగుతున్నారు సీఎం కేసీఆర్ దళిత సమాజం జీవితకాలం రుణపడి ఉంటుందని వ్యతిరేకించే వారికి విజ్ఞప్తి దళిత బంధు పథకం పై ఇతర పార్టీలు విషం కక్కుతున్న వారికి దళిత బంధు పథకం పై వ్యతిరేకత దళిత సమాజం పై వ్యతిరేకత అవుతుంది. ఇంతటి దీనా కష్టాల్లో ఉన్న దళిత సమాజానికి ఆదుకోవాల్సిన అత్యవసర పరిస్థితులను కెసిఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమలా నెహ్రూ కాలనీ సంఘ పెద్దలు ఆర్మూర్ డివిజన్ ఇంచార్జ్ అధ్యక్షులు లు కందుల రాములు సంఘం ప్రభాకర్ మల్ల మరి ఎల్లయ్య మారంపల్లి నర్సయ్య కొన్నారా సుదర్శన్ టిఆర్ఎస్ నాయకులు పొన్నాల రాజన్న చిన్న దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Leave a comment