Home జనరల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు…
జనరల్

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు…

ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ గారికి మరియు ఆర్మూర్ న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న నసీమా సుల్తానా సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ మరియు దీప్తి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గార్లకు పుష్పగుచ్చము ,శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు చేపుర్ గణేష్ పేర్కొన్నారు అనంతరం జడ్జి మేడంలు మాట్లాడుతూ అంతర్జాతీయ వ్యాప్తంగా లైన్స్ క్లబ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనియమని అదేవిధంగా ఈరోజు మహిళ దినోత్సవ సందర్భంగా స్త్రీలను గౌరవించేటువంటి క్రమంలో బాగంగా సన్మానం చేయడం పట్ల వారు హర్ష వ్యక్తం ప్రకటించారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత గారు కూడా కూడా లైన్స్ క్లబ్ గ్రీన్ వారికి అభినందనలు తెలియజేశారు ఉమెన్స్ డే మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో 1909 ఫిబ్రవరి 28 నాడు సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నది అదే నేపథ్యంలో 1975 లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించడం జరిగింది. నాటినుండి నేటి వరకు సమాజంలో మహిళలు ఎన్నో రంగాలలో తమ తమ విధులు నిర్వహించడం జరుగుతుంది వారికి ప్రోత్సాహంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందనీ ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే ఒక థీమ్ ని కూడా ప్రవేశ పెట్టడం జరుగుతుందనీ మరి ఈ సంవత్సరము “”బుక్స్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ “” అనేది ప్రవేశ పెట్టడం జరిగింది అని లైన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టర్ అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి భూసం ప్రతాప్ కోశాధికారి పోల్కం వేణు క్యాబినెట్ మెంబర్ డీకే రాజేష్, ప్రోగ్రాం చైర్మన్ గుజరాతి ప్రకాష్ ప్రతినిధులు అల్జాపూర్ రాజేష్ ,నరేందర్ టీచర్, నసీరుద్దీన్ ,దాచేపల్లి సంతోష్ ,నలంద ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

నేడే వాహనాల వేలంపాట – మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి వెల్లడి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: నేడు నిర్వహించబడబోయే వాహనాల వేలంపాటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మోటార్ వెహికల్...

జనరల్

67 వారానికి చేరుకున్న జర్నలిస్ట్ కాలనీ స్వచ్ఛ కాలనీ కార్యక్రమం…

ఆర్మూర్, తేలంగాణ వార్త::ఆదివారం జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన...

జనరల్

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి…..

ఆర్మూర్, తెలంగాణ వార్త :: ఆర్మూర్ మండలంలోని పిప్రీ గ్రామంలో పిప్రీ ఆరోగ్య ఉప కేంద్రo...

జనరల్

సీజ్ చేసిన వాహనాల ను ఈనెల 29న వేలం వేయనన్నట్టు తెలిపిన వెహికల్ ఇన్స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి…

తెలంగాణ వార్త, ఆర్మూర్::: గత కొన్ని సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి వివిధ...

You cannot copy content of this page