*ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి బొడ్డు గోపి*
ఆర్మూర్, తెలంగాణ వార్త: సెప్టెంబర్ 13: నిజామాబాద్ జిల్లాలోని పట్టణంలో గల ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం తెలంగాణ మాదిగ మహాసేన సంఘం జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు పొన్నాల చంద్రశేఖర్, బొడ్డు గోపి లు హాజరై మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మాదిగ మహా సేన సంఘం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు అలాగే రాష్ట్రంలో టి.ఎం.ఎం.ఎస్ జిల్లాలో కమిటీలు కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఇట్టి సంగం పేరును వాడుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు ఈ సంఘానికి ప్రభుత్వం చే రిజిస్ట్రేషన్ కలిగి రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘం బలోపేతం అవుతుందని అన్నారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి మాట్లాడుతూ.. తెలంగాణ మాదిగ మహాసేన సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ స్వయశక్తుల సహకరిస్తాన్నాని,అలాగే జాతి బలోపేతానికి దోహదపడతానని దళితులపై దాడులు జరిగే విషయాన్ని వెంటనే ఖండించి వారికి చట్టరీత్యా చర్యలు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ మాదిగ మహాసేన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలతో పాటు ప్రతి మండలంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా ఈ యొక్క సంగం పేరును వాడుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు తెలంగాణ మాదిగ మహాసేన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో జిల్లా ఆర్మూర్ పట్టణ నాయకులతో పలు అంశాలపై చర్చించి జిల్లా అధ్యక్షులు గంగాని స్వామిని జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల రాజన్న పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భాస్కర్, పెద్దలు కిష్టయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్ శీను సభ్యులు కార్తీక్ భరత్ నరేష్ రాజలింగం ముంద రాజన్న చక్రధర్ రంజిత్ బాల్ రాజ్ మంద రాజన్న కే బాలు ఎస్ దిలీప్ ఏం రాహుల్ పాల్గొన్నారు.
Leave a comment