Home జనరల్ మహారాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి… భారీ చేరికలు.
జనరల్

మహారాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి… భారీ చేరికలు.

(తెలంగాణ వార్త )మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ లో అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా ప్రజాధరణ పొందుతున్నవి.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల తో పాటు, రైతు సంఘాల నేతలు, ముస్లిం మైనారిటీ వర్గాల నేతలు కూడా సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలనపట్ల ఆకర్షితులవుతున్నారు. తెలంగాణ లో అమలవుతున్న రైతు మోడల్ మాదిరిగా తెలంగాణ మైనారిటీ అభివృద్ధి మోడల్ మహరాష్ట్ర సహా దేశ వ్యాప్తంగా అమలు చేయాలని బలంగా కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం నాటి మహారాష్ట్ర రైతు సంఘాల నేతల చేరిక జాతీయస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోగా,
దీని కొనసాగింపుగా ఆదివారం నాడు మహారాష్ట్ర ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా, హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అధినేత సీఎం కేసీఆర్ గులాబీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.

సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా., మహారాష్ట్ర కు చెందిన ప్రముఖ నేత. ఎన్ సి పి పార్టీ ఉపాధ్యక్షుడు. వీరు మహారాష్ట్ర లోని ఔరంగబాద్ సెంట్రల్ నియోజకవర్గం నుండి 2019 సంవత్సరంలో ఎన్ సి పి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఎన్ సి పి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా మరియు, మహారాష్ట్ర ఎన్ సి పి పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు.
వారు ఎన్సిపి మహారాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కూడా.
వీరు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ నేత కావడంతో వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. వీరికి ఔరంగాబాద్ జిల్లా ప్రాంతాల్లో రాజకీయ పట్టు వుంది.
ఈ సందర్బంగా ఆర్మూర్ ఎంఎల్ఏ జీవన్ రెడ్డి, మహారాష్ట్ర కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నేతలు..రైతు నాయకుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే,వైజాపూర్ విధానసభ నియోజకవర్గ నాయకుడు అభయ్ పాటిల్, చిక్కగాంకర్ సాహెబ్, దళిత యువజన నాయకుడు ఏవీన్ష్ వస్మత్, ప్రహ్లాద్ రాఖోండే సాహెబ్, గోరఖ్ పాటిల్, శ్యామ్ కదమ్, గోవింద్ ధెంబారే, దేవానంద్ పాటిల్, తుకారాం సాల్వే, చంద్రవిలాస్ తొంబరే పాటిల్, గజానన్ కదమ్,సంతోష్ పాటిల్,యువనేత ప్రవీణ్ జెతెవాడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

You cannot copy content of this page