Home జనరల్ <em>బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్</em>
జనరల్

బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్

లక్షలాదిగా తరలివచ్చిన మహారాష్ట్ర ప్రజలు

మహారాష్ట్ర (తెలంగాణ వార్త) రైతులు,యువతలో సరికొత్త జోష్

-గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అఖండస్వాగతం

-కేసీఆర్ గారు వివరించిన తెలంగాణ మోడల్ కు సభలో జేజేలు

-మహారాష్ట్ర లోనూ అమలు చేయాలని నినాదాలు

-బీఆర్ ఎస్ లో పెద్ద ఎత్తున చేరిన మహారాష్ట్ర నేతలు

-అనూహ్యరీతిలో కంధార్-లోహ సభ విజయవంతం కావడం హర్షణీయం

-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-సభను సక్సెస్ చేసిన మహారాష్ట్ర బీఆర్ ఎస్ నేతలకు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు

కంధార్-లోహ(మహారాష్ట్ర):-

మహారాష్ట్రలోని కంధార్-లోహలో ఆదివారం నిర్వహించిన బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కంధార్-లోహ సభకు మహారాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో తరలివచ్చి
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అఖండస్వాగతం పలికారని ఆయన తెలిపారు. ప్రధానంగా సభకు హాజరైన రైతులు, యువతలో సరికొత్త జోష్ కనిపించిందన్నారు.
సభా వేదిక పైనుంచి కేసీఆర్ గారు వివరించిన తెలంగాణ మోడల్ కు సభలో మహారాష్ట్ర ప్రజలు జేజేలు పలికారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహారాష్ట్ర లో కూడా అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారని జీవన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం పై ఉన్న అచంచల విశ్వాసంతో మహారాష్ట్రకు చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కేసీఆర్ గారి సమక్షంలో
బీఆర్ ఎస్ లో పెద్ద ఎత్తున చేరినట్టు ఆయన చెప్పారు.
అనూహ్యరీతిలో కంధార్-లోహ సభ విజయవంతం కావడం హర్షణీయమన్నారు.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లే కలవరపాటుకు గురయ్యేలా బీఆర్ ఎస్ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసిన మహారాష్ట్ర బీఆర్ ఎస్ నేతలకు, కార్యకర్తలు, ప్రజలకు, తెలంగాణ నుంచి వచ్చిన బీఆర్ ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

జనరల్

అధికార పార్టీకి అసమ్మతి సెగ పార్టీ వీడిన బి ఆర్ ఎస్ క్యాడర్…

టిఆర్ఎస్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి నిరసనగా ముధోల్, తెలంగాణ వార్త ; అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న...

You cannot copy content of this page