Home జనరల్ నన్ను మళ్లీ దీవించండి.నేను మీ కోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని..
జనరల్

నన్ను మళ్లీ దీవించండి.నేను మీ కోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని..

తెలంగాణ వార్త: అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల లా పరుగులు పెట్టిస్తున్నా

-అభివృద్ధి జరగని పల్లెలేదు -సంక్షేమ పథకాలు అందని ఇల్లులేదు

-గౌరవ సీఎం కేసీఆర్ గారు ప్రజల పాలిట దేవుడు

-తెలంగాణ వస్తే ఏమొస్తదన్న సన్నాసులకు చేపూర్ గ్రామమే సమాధానం

-చేపూర్ నాకు సెంటిమెంట్

-అభివృద్ధి పనులతో చేపూర్ రూపురేఖలే మారిపోయాయి

-బీజేపీ, కాంగ్రెస్ లకు ఓట్లు,నోట్లు తప్ప ప్రజలు పట్టరు

-ఓటేసిన ప్రజలనే కాటేసే పార్టీలవి

-బీఆర్ ఎస్ అంటేనే బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం

-కేసీఆర్ గారి జమానా అభివృద్ధికి నమూనా

-గతంలో ఎప్పుడైనా ఈ అభివృద్ధి చూసారా?

-సబ్బండ వర్గాలన్నీ సారు,కారు,కేసీఆర్, బీఆర్ ఎస్ వైపే

-కాంగ్రెస్, బీజేపీ నేతల మాయలో పడొద్దు

-కన్న తండ్రికే తిండిపెట్టనోడు మిమ్మల్ని ఉద్దరిస్తాడా

-ఎంపీ అరవింద్ ఒక నయవంచకుడు

-బీజేపీ ఒక విషవలయం

-కాంగ్రెస్ అవినీతికి నిలయం

-ఇవిగో నేను చేపూర్ లో చేసిన మంచిపనులు

-జై బీఆర్ఎస్ అని ఈ గ్రామ ప్రజలు చప్పట్లు కొడితే కాంగ్రెస్, బీజేపీల దిమ్మదిరిగాలి

-మోడీ మైండ్ బ్లాంక్ కావాలి

-మళ్లీ మళ్లీ విజయం బీఆర్ఎస్ దే

-ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తా

-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-పండుగలా “నమస్తే చేపూర్ ….మీ కోసం మీ జీవన్ రెడ్డి” కార్యక్రమం

  • జీవన్ రెడ్డి కి అపూర్వ స్వాగతం పలికిన చేపూర్ గ్రామస్థులు

ఆర్మూర్, ఏప్రిల్4:-( తెలంగాణ వార్త)
నిరంతరం ప్రజాసేవకే పునరంకితమైన నన్ను మళ్లీ దీవించండి అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అర్ధించారు. “నమస్తే నవనాథ పురం” కార్యక్రమానికి కొనసాగింపుగా వినూత్నరీతిలో చేపట్టిన “నమస్తే చేపూర్ ….మీ కోసం మీ జీవన్ రెడ్డి” కార్యక్రమం ఆర్మూర్ మండలంలోని చేపూర్ లో మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చేపూర్ గ్రామానికి చేరుకున్న జీవన్ రెడ్డికి ఆ గ్రామ ప్రజలంతా మేళ తాళ్లాలతో అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తునతరలి వచ్చ మంగళ హారతులు పట్టి జీవన్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆశీస్సులు అందజేశారు.పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఏ సందర్భంగా చేపూర్ గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో “జై కేసీఆర్, దేశ్ కీనేత కేసీఆర్, జై జీవనన్న” అన్న నినాదాలతో మారుమోగించారు. కాగా జీవన్ రెడ్డి ప్రజలతో కలిసి గ్రామమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పేరు పేరున పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం చేపూర్ గ్రామంలో జరిగిన భారీ సభలో జీవన్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగించి చేపూర్ గ్రామ ప్రజల మనసు దోచుకున్నారు
“నేను మీ కోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని. నేను మీ బిడ్డను. నా జీవితం ప్రజాసేవకే అంకితం.
ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల లా పరుగులు పెట్టిస్తున్నా. ప్రగతి పథంలో ఆర్మూర్ పేరును చరిత్రలోనే చెరగని పేజీలా సువర్ణాక్షరాలతో లిఖిస్తా. ఆర్మూర్ నియోజకవర్గం గతంలో ఎట్లుంది?.ఇప్పుడెట్లుంది?.
అభివృద్ధి జరగని పల్లె ఉందా?. సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉందా?.
గౌరవ సీఎం కేసీఆర్ గారు ప్రజల పాలిట దేవుడు. తెలంగాణ వస్తే ఏమొస్తదని చేపూర్ చౌరస్తాలో నిలబడి కారుకూతలు కూసిబా సన్నాసులకు చేపూర్ గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే ధీటైన సమాధానం.
చేపూర్ గ్రామమంటే నాకు సెంటిమెంట్.
ఎనిమిదేళ్లుగా జరుగుతున్నఅభివృద్ధి పనులతో చేపూర్ రూపురేఖలే మారిపోయాయి.
-గతంలో ఎప్పుడైనా ఈ అభివృద్ధి చూసారా?. ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన పనుల గురించి చెప్పడానికే నేనొచ్చా. చేపూర్ గ్రామంలో 998 మందికి రూ.2116,రూ.3116 చొప్పున నెలకు 18 లక్షల 86 వేల 512 రూపాయలు ఆసరా పెన్షన్ల కింద వస్తున్నాయి.
ఇన్ని పెన్షన్లు గతంలో ఎప్పుడైనా వచ్చాయా?.
కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఒక పెన్షన్ దారుడు చచ్చిపోతేనే కొత్త పెన్షన్ ఇచ్చే దుర్మార్గ పరిస్థితి ఉండేది.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజాపక్షపాతి.అందుకే పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తూ మీకు భరోసా కల్పించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు చనిపోతే పట్టించుకునే దిక్కు ఉండేదికాదు. మన పెద్ద రైతు కేసీఆర్ గారు అన్నదాతల పాలిట దేవుడు. అందుకే ఏ కారణం చేతనైన రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని తక్షణమే ఆడుకోవాలన్న లక్ష్యంతో తెచ్చింది రైతు బీమా.
రైతు చనిపోయిన72 గంటల లోగా ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నాం. గతంలో పెట్టుబడి లేక రైతులు నానా బాధలు పడ్డారు. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితి చూసి వేదనకు గురైన రైతు కేసీఆర్ గారి గుండె బాధలో నుంచి పుట్టిందే రైతుబంధు.
చేపూర్ గ్రామంలో వానా కాలంలో 977 మంది రైతులకు 1కోటి 12 లక్షల 63 వేల 514 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం వస్తున్నది.
యాసంగిలో 965 మంది రైతులకు 1కోటి 11 లక్షల 30వేల 940 రూపాయల చొప్పున సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో పడుతున్నది.
మొత్తం మీద సంవత్సరానికి 2 కోట్ల 23 లక్షల 94 వేల 454 రూపాయల చొప్పున ఇప్పటి వరకు రూ. 11కోట్ల పైనే రైతుబంధు కింద మీకొచ్చాయి.
గతంలో అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేసిన దళిత సోదరులు ఇకనైనా ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుకోవాలని కేసీఆర్ గారు ప్రారంభించిన దళిత బంధు ద్వారా ఈ గ్రామంలో కూడా ఇద్దరికి 10 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు సాయం వచ్చింది.
కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక లక్షా116 రూపాయల చొప్పున ఇస్తూ ప్రభుత్వమే పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేస్తున్నది.
నేను మన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నా.
నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 25వేల మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సాయం అందించా.
ఈ చేపూర్ గ్రామంలో కూడా 96 మందికి 38 లక్షల 40 వేల రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు ఇప్పించా. 9 మందికి 4 లక్షల 12 వేల రూపాయల ఎల్ వో సీ చెక్కులు మంజూరు చేయించా.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 184 దరఖాస్తులు వచ్చాయి.
త్వరలోనే వాటిని మంజూరు చేయిస్తా.
సొంత స్థలం ఉన్నవారు ఇండ్లు కట్టుకునేందుకు 3లక్షల రూపాయల చొప్పున ఈ గ్రామానికి ఇప్పిస్తా.
అయిదు నాయీ బ్రాహ్మణ దుకాణాలకు , మరో అయిదు రజక కుటుంబాల లాండ్రీ దుకాణాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ప్రసవాలను ప్రోత్సహిస్తున్నాం.
ఈ గ్రామంలో మొత్తం 28 మందికి కే సీఆర్ కిట్లను ప్రభుత్వం అందించింది.
చేపూర్ గ్రామానికి చెందిన ఇద్దరికి ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశం ఇప్పించా.
ఈ నెల 23వ తేదీన ప్రారంభం కాబోతుంది.
అందరూ కంటి పరీక్షలు చేయించుకోండి. చేపూర్ లో మాదిగ సంఘం భవనానికి 10 లక్షల రూపాయిలు, రజక సంఘం భవనానికి రూ. 2లక్షలు,
గుర్రం సంఘం భవనానికి రూ. 5లక్షలు, మాల సంఘం భవనానికి రూ. 5లక్షలు
మాదిగ సంఘం భవనం నిర్మాణానికి చేపూర్ పల్లె లో రూ. 5లక్షలు, నుతాన సంఘం ( అన్ని కుల సంఘాల ) భవనానికి రూ. 3లక్షలు మంజూరు చేశా.
చేపూర్ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం 2కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఇప్పటికే పనులు పూర్తి చేయించా.
క్రీడా మైదానం కోసం 2 లక్షల రూపాయలను మంజూరు చేశా.
ఈ గ్రామంలో వైకుంఠ ధామం, స్మశాన వాటికకు 10 లక్షల రూపాయిలు మంజూరు చేశా. చేపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం కోసం 5 లక్షల రూపాయిలు ఇచ్చా. చేపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ కోసం ఒక కోటి ఒక లక్ష రూపాయలు మంజూరు చేశా. రూ.72 లక్షల 20వేల విలువ చేసే 66గొర్రెల యూనిట్లను ఈ గ్రామానికి ఇప్పించా. ఇవన్నీ చేశానా?.లేదా?. నేను చెప్పినవన్నీ నిజాలేనని మీరు నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. జై బీఆర్ఎస్ అని నినాదాలు చేస్తూ మీరు చప్పట్లు కొడితే కాంగ్రెస్, బీజేపీల దిమ్మదిరిగాలి.మోడీ మైండ్ బ్లాంక్ కావాలి”అని జీవన్ రెడ్డి అన్నప్పుడు గ్రామస్తులంతా దిక్కులు పిక్కటిల్లేలా కొట్టిన చప్పట్లతో చేపూర్ మారుమోగింది.

బీజేపీ, కాంగ్రెస్ లకు ఎప్పుడూ ఓట్లు,నోట్ల గొడవే

-ఈ రెండు జాతీయ పార్టీలకు ప్రజలంటే చులకన

బీజేపీ, కాంగ్రెస్ లకు ఎప్పుడూ ఓట్లు,నోట్ల గొడవే తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఆయన ధ్వజమెత్తారు.
ఈ రెండు జాతీయ పార్టీలకు ప్రజలంటే చులకన భావం ఉందన్నారు. బీఆర్ఎస్ లా ప్రజల కోసమే పనిచేసే మంచి బుద్ధి కాంగ్రెస్, బీజేపీలకు కొరవడిందన్నారు.
అవి ఓటేసిన ప్రజలనే కాటేసే పార్టీలని ఆయన మండిపడ్డారు.
బీఆర్ ఎస్ అంటేనే బలహీన వర్గాలు, రైతుల సంక్షేమన్నారు.
కేసీఆర్ గారి జమానా అభివృద్ధికి నమూనా అని, సబ్బండ వర్గాలన్నీ సారు,కారు,కేసీఆర్, బీఆర్ ఎస్ వైపే చూస్తున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నేతల మాయలో పడొద్దన్నారు.
కన్న తండ్రికే తిండిపెట్టనోడు మిమ్మల్ని ఉద్దరిస్తాడా?.
ఎంపీ అరవింద్ ఒక నయవంచకుడు. ఒకే కొంపలో మూడు కుంపట్లు, మూడు పార్టీలు. సొంతింటినే రచ్చకీడ్చుకున్న ఈ ప్రబుద్దులా ప్రజలకు మేలు చేసేది.
బీజేపీ ఒక విషవలయం.
కాంగ్రెస్ అవినీతికి నిలయం.
ఏ కాంగ్రెస్ వాడో, బీజేపీ వాడో మనకొద్దు. బీఆర్ఎస్ , జీవన్ రెడ్డే మీకు ముద్దు..
మళ్లీ మళ్లీ విజయం బీఆర్ఎస్ దే. ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తా అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జీవన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పస్కా నర్సయ్య, జడ్పీటీసీ సంతోష్, సర్పంచ్ సాయన్న, ఎంపీటీసీ బాల నర్సయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్ , విడీసీ అధ్యక్షుడు రిక్కలా రాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ జన్నపల్లి గంగాధర్, బీఆర్ ఎస్వీ నాయకులు షాహిద్, గంగాధర్ , నాగరాజు బీఆర్ఎస్ నాయకులు సిందుకర్ చరణ్ & శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఉచితంగా బతుకమ్మ దసరా చీరలు పంపిణీ చేసిన రవీందర్ యాదవ్….

కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉండాలి పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంచిన రవీందర్ యాదవ్ బతుకమ్మ, దసరా...

జనరల్

డి.పోచంపల్లి లో రాజ శ్యామల యాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు..

డి పోచంపల్లి, తెలంగాణ వార్త:: డి. పోచంపల్లి లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ...

జనరల్

వాహనం ఢీకొని బాలుడు మృతి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: టాటా ఎస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన భీమ్...

జనరల్

రెవెన్యూలో మళ్లీ వీఆర్వో ల పోస్టులు. మంత్రి పొంగులేటి….

హైదరాబాద్, తెలంగాణ వార్త:: రాష్ట్రంలో మళ్లీ వీఆర్‌వో, వీఆర్‌ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి...

You cannot copy content of this page