తెలంగాణ వార్త::తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త అందించింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డిఏ) పెంపును ప్రకటించారు. ఈ పెంపుతో ప్రతినెల ఆర్టీసీపై అదనంగా రూ.3.6 కోట్లు భారం పడనుండగా.. ఉద్యోగులంతా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల మంది ఉచితంగా ప్రయాణించారని.. దీని కారణంగా ఉద్యోగులపై అదనపు భారం పడి ఒత్తిడికి గురయినా.. వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి ఉద్యోగులను అభినందించారు.
ఇక.. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ – 2025 కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ కింద.. గ్రామాల్లో సెర్ప్, పట్టణాల్లో మెప్మా పరిధిలో ఉన్న మహిళా సంఘాలను ఐక్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై.. ఈ మహిళా సంఘాలన్నీ ఒకే వ్యవస్థ కింద పనిచేస్తూ.. అభివృద్ధికి మరింత దోహదపడతాయి.

Leave a comment